Chandra Grahan : నేడు చంద్రగ్రహణం … ఏ రాశి వారికి ఆ శుభం… వివరాలు తెలుసుకోండి…!
Chandra Grahan ; నవంబర్ 8న కార్తీక పౌర్ణమి ఉన్నది. అయితే ఈ కార్తిక పౌర్ణమి ముందు రోజు అంటే ఏడో తారీఖు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనగా నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనున్నది. కావున ముందు రోజే కార్తీక పౌర్ణమి జరుపుకోవడం మంచిదని శాస్త్ర నిపుణులు తెలియజేయడం జరిగింది. ఆరోజున రాహు గ్రస్త గ్రాస్టోడే చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం వలన నాలుగు రాశుల వారికి ఆ శుభం. మరో నాలుగు రాశుల వారికి శుభ సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇంకో నాలుగు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మేషరాశిలో గ్రహణం ఉన్నందున ఈ రాశి వారికి మూడవ ఆరవ 10వ, 11వ, గృహంగా ఉన్నవాళ్లకి శ్రేయస్కరం. కర్కాటక, మిధున, వృశ్చిక, కుంభ రాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఒకటి, నాలుగు, ఎనిమిది 12న మేషరాశి వాళ్లకి అశుభ ఫలితాలు కనపడుతున్నాయి.
అనగా మేష, మకర, వృషభ, కన్య రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు రానున్నాయి. అదేవిధంగా రెండోవ ఐదవ ఏడవ తొమ్మిదవ ఇంట్లో గ్రహణం ఏర్పడితే అనగా ధనస్సు, సింహ, తుల మేషరాశులలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.. చంద్రగ్రహణం టైంలో చేయవలసిన పనులు… చంద్రగ్రహణం మధ్యాహ్నం2.38 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం నాలుగు గంటల 29 గంటలకు సాయంత్రం 6.19 గంటలకు మోక్ష కాలానికి ఒకసారి, ఈ విధంగా మూడుసార్లు బట్టలు ధరించి స్నానం చేయాలని శాస్త్రం తెలుపుతోంది. చంద్రోదయం తర్వాత స్పర్శ స్నానం చేసే బదులు ఆ సమయంలో ఈ నియమాన్ని పాటించడం శ్రేయస్కరం అంటున్నారు. వేద పండితులు. ఈ గ్రహణ టైంలో భగవాన్ నామ స్మరణ, జపాలు ప్రత్యేకంగా జపించాలి. అని అంటున్నారు. కావున ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది.
అలాగే ఇతర పనులు చేయడం కంటే భగవంతుడిని ధ్యానంలో మునిగిపోవడం చాలా మంచిది. గ్రహణ టైంలో ప్రస్తావనకు ఇచ్చే మరో అంశం దానాలు. ఈసారి రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఆ మూలంగా వరి ధాన్యం, పప్పులు లేదా బియ్యం చంద్రబింబం తో పాటు తమలపాకులు కొబ్బరి, అరటి దానం చేయాలి. వీటికి బ్రాహ్మణులకు దానం చేయాలని పండితులు తెలుపుతున్నారు. చంద్ర గ్రహణ సమయం వివరాలు… చంద్రగ్రహణం స్పర్శ టైంలో మధ్యాహ్నం 2.38 గంటల నుండి నాలుగు గంటల 29 గంటలకు, మోక్ష సమయం సాయంత్రం 6.19 ఈ సమయంలో చంద్రుడు కనిపించడు. అయితే చంద్రోదయం సాయంత్రం 5.59కి ఉంది. ఆ తదుపరి చంద్రుడు కనిపిస్తాడు. గ్రహణ వ్యవధి 3. 40 గంటలు ఉన్నది. అయితే ఇది 20 నిమిషాలు మాత్రమే మంచిగా కనిపిస్తుంది.