Devotional News : దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు?
Devotional News : హిందూ సంప్రదాయాల ప్రకారం మనం పూజ చేసినప్పుడు లేదా గుడికి వెళ్లినప్పుడు కచ్చితంగా గంట కొడ్తాం. అయితే హారతి ఇచ్చే సమయంలో కచ్చితంగా గంట మోగిస్తుంటారు. ఇంట్లో అయినా గుడిలో అయినా ఎలాంటి పూజలు, వ్రతాలు, నోములు జరిగినా హరతి సమయంలో కచ్చితంగా గంట కొడ్తుంటారు. అయితే అసలు గంట ఎందుకు కొట్టాలి. గంట కొట్టడం వల్ల లాభం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడి దర్శనం అంటే మనలోని బాధను, కష్టాలను, అసుర గుణాలను పోగొట్టి… సంతోషాన్ని, ఆనందాన్ని, దైవీ గుణాలను ఆహ్వానించడమే. అయితే రాక్షసులను తరిమి కొట్టి.. దేవతలను ఆహ్వానించేందుకే సంకేతంగానే గంట కొడుతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అందుకే గుడిలోకి వెళ్లగానే గంట కొట్టి స్వామి వారిని ఆహ్వానిస్తుంటాం. ఆ తర్వాతే దైవ దర్శనం చేసుకుంటాం. హారతి సమయంలో కూడా అందుకే గంట కొడుతుంటారని వేద పండితులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల స్వామి వారి దివ్య రూపం దర్శనం అవుతుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా అదే సమయంలో భగవంతుడికి ఇచ్చే హారతి దివ్య జ్యోతిగా ప్రజ్వలిస్తుందంట. మనం గంట కొట్టినప్పుడు వచ్చే నాదం… దివ్య నాదంగా మారుతుందట. ఆ హారతి వెలుగుల్లో స్వామి దివ్య దర్శని చూస్తే… భక్తుల మనుసులో ఎనలేని ఆనందం కల్గుతుందట.అంతే కాకుండా ఏదైనా సాధించగలమనే నమ్మకం కూడా వస్తుందట. అంతే కాకుండా చాలా మంది భక్తులు కోరిన కోరిక తీరిస్తే.. గుడిలో గంటలు కడతామని మొక్కుతుంటారు.
అందుకే చాలా ఆలయాల్లో ఒకటి రెండు కాకుండా చాలా గంటలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు త్వరగా మాటలు రాకపోయినా… మాటలు వస్తే గంటలు కజతామని మొక్కతారు. మాటలు వచ్చిన వెంటనే వెళ్లి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మన హిందూ సంప్రదాయంలో ఏ పని చేసిన దాని వెనుక ఓ కారణం ఉంటుంది. దేవతలను రమ్మని మేల్కొల్పేందుకు ఆలయాల్లో ఈ గంటలు ఉంటాయి. గుడికి వెళ్లిన ప్రతీ ఒక్క భక్తుడు గంట కొట్టి ఆ దేవుడిని పిలుస్తాడు. ఆ తర్వాతే దర్శనం చేసుకుంటాడు. ఇలా దైవ దర్శనానికి వెళ్లిన వారందరూ మర్చిపోకుండా గుడి గంటను ఒక్క సారి అయినా సరే కొట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ బాధలు విని మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.