అమావాస్యరోజు ఇలా చేస్తే సిరిసంపదలు మీ సొంతం !
అమావాస్యరోజు ఇలా చేస్తే సిరిసంపదలు మీ సొంతం ! కార్తీకమాసం చివరిరోజు అందులోనూ సోమవారం అమావాస్య దీన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈ సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.
ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ , జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి , శివ స్తోత్రాలతో కొలిస్తే… సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ , రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.