Chandra Grahan : చంద్ర గ్రహణం తర్వాత ఈ పనులు చేస్తే .. అదృష్టం తలుపు తడుతుంది…!
Chandra Grahan : సూర్య గ్రహణం, చంద్రగ్రహణం అనేది ఖగోళంలో జరిగే ఒక అద్భుతమైన సంఘటన. అయితే ఈ సంఘటన అశుభకరమైనదిగా జ్యోతిష్యం లో పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం 15 రోజుల తేడాతో రెండు గ్రహణాలు వచ్చాయి. దీపావళి రోజున అక్టోబర్ 25న సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 8న చంద్రగ్రహణం రానుంది. ఈ చంద్రగ్రహణం ఇండియాలో చాలా ప్రాంతాలలో కనిపించదు. ఈరోజు వస్తున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవది. ఈసారి చంద్రగ్రహణం మధ్యాహ్నం 2:38 ప్రారంభమై సాయంత్రం 4:29 నిమిషాలకు ముగుస్తుంది. దాదాపు గంటపాటు గ్రహణం కనిపించనుంది. చంద్రగ్రహణం పాక్షికమైనది అయిన దీని ప్రభావం మనపై ఉంటుంది అంటున్నారు.
ఎవరైనా ఇబ్బందులతో బాధపడేవారు గ్రహణానికి ముందు లేదా గ్రహణం తర్వాత లేదా మరుసటి రోజు ఈ వస్తువులను దానం చేస్తే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీరు నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నట్లయితే గ్రహణం రోజున తెల్లటి ముత్యాలు లేదా తెల్లటి ముత్యాలతో చేసిన ఆభరణాలను దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు లేనివారు గ్రహణం రోజున నిరుపేద పిల్లలకు పాలు, బొమ్మలు మరియు బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఇంట్లో ఎవరైనా ఎప్పటినుంచో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే గ్రహణం రోజున గాజు పాత్రలో నీరు పోసి అందులో వెండినాణెం వేసి జబ్బు పడిన వ్యక్తి నీటితో నిండిన గిన్నెలో తన ముఖాన్ని ఉంచాలి. ఆ తర్వాత నాణెంతో గిన్నెను దానం చేయాలి. ఇలా చేయడం వలన అతని ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు గ్రహణం రోజున పాలు, అన్నం లేదా వాటితో చేసిన ఏదైనా వంటకాన్ని దానం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం వీటిని దానం చేయడం వలన విష్ణువు, లక్ష్మీదేవిల అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఇబ్బందులు ఉంటే గ్రహణం రోజున పంచదార లేదా తెల్లని బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.