Chandra Grahan : హోలీ నాడు చంద్రగ్రహణం, ఈ రాశులకి కష్టాలే.. గ్రహదోష పరిహారాలు…?
ప్రధానాంశాలు:
Chandra Grahan : హోలీ నాడు చంద్రగ్రహణం, ఈ రాశులకి కష్టాలే.. గ్రహదోష పరిహారాలు...?
Chandra Grahan : 2025 వ సంవత్సరం లో మార్చి 14వ తేదీన హోలీ పండుగ వస్తుంది. ఇదే హోలీ రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా హోలీ నాడే చంద్రగ్రహణం ఏర్పడం చాలా అరుదుగా జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణానికి అశుభమైనదిగా భావిస్తారు. ఈ చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలిపింది. హోలీ రోజున చంద్రగ్రహణ ప్రభావం మీ పైన పడకూడదు అంటే గ్రహణానికంటే ముందు మీరు కొన్ని చర్యలను తప్పక తీసుకోవాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఏర్పడే ప్రతికూల ప్రభావాలను వివరించవచ్చు. ఇలా చేస్తే గ్రహణ ప్రభావం కొంతమేరకు తగ్గుతుంది. ఎంతో అరుదుగా హోలీ పండగ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇలా చంద్రగ్రహణం అన్ని రాశుల పైన ప్రభావితం కానుంది. కొన్ని నివారణ చర్యలను పాటించడం ద్వారా గ్రహణ ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పున్నమి వున్నాడు చంద్రగ్రహణం ఏర్పడడం అశుభంగా భావిస్తారు. హోలీ పండుగ పున్నమి నాడు వస్తుంది. అటువంటి పున్నమినాగు చంద్రగ్రహణం ఏర్పడితే అది ఆ శుభం. ఈ చంద్రగ్రహణ సమయంలో శివుని ఆరాధిస్తే పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంకా భోలేనాథ్ ను పూజించడం ద్వారా ప్రజలపై చంద్రగ్రహణ ప్రభావం తగ్గుతుంది.

Chandra Grahan : హోలీ నాడు చంద్రగ్రహణం, ఈ రాశులకి కష్టాలే.. గ్రహదోష పరిహారాలు…?
మన తెలుగు పంచాంగం ప్రకారం. 2025 వ సంవత్సరం, మొదటి చంద్రగ్రహణం మార్చి 14వ తేదీ, శుక్రవారం నాడు ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 14 ఉదయం 9:27 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఆరు గంటల మూడు నిమిషాల పాటు కొనసాగుతుంది. నిజంగా చెప్పాలంటే, చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక గ్రహణ సూతక కాలం భారతదేశంలో చెల్లెదు. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా మొదలైన ప్రాంతాలలో కనిపిస్తుంది.
Chandra Grahan చంద్ర గ్రహణానికి ముందు ఈ పని చేయండి
. హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుట వలన ఆ సమయంలో శివుడిని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. శివుడు చంద్రునికి అధిపతిగా భావిస్తారు. కావున ఆయనను పూజిస్తే చంద్రగ్రహణ ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.
. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని జపించాలి. మీరు, “ఓం సోమ సోమాయ నమః ” అనే మంత్రాన్ని జపించాలి.
. ఈ చంద్రగ్రహణ సమయంలో దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. పేదలకు, అవసరమైన వ్యక్తులకు తెల్లటి బట్టలు, బియ్యం, పాలు లేదా వెండిని దానం చేస్తే ఇంకా మంచిది.
చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకులను తెంపి పక్కన ఉంచండి. గ్రహణ సమయంలో వాటిని ఆహారం, నీటిలో కలిపి ఉపయోగించండి.
. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించి ఇంటిని శుభ్రంగా చేయాలి. చంద్రగ్రహణ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ రాశులపై ఉంటుంది
చంద్రగ్రహణం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల పై మాత్రం గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏ రాశులకు గ్రహణ ప్రభావం ఉంది. ఆయా రాశుల్లో జన్మించిన వ్యక్తులు చంద్రగ్రహణానికి ముందు కొన్ని ప్రత్యేక చర్యలను పాటించాలి.
వృషభ రాశి : వృషభ రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శివుడిని ఆరాధించాలి. చంద్రునికి మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల ఆ రాశికి చెందిన వ్యక్తులకు చేపట్టిన పనులు ఆగిపోతే అవి త్వరగా తిరిగి ప్రారంభమవుతాయి. ఏ పని చేసిన అన్నిట్లో విజయమే పొందుతారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు చంద్రగ్రహణ సమయంలో దానాలు చేయాలి. ఈ సమయంలో తులసీదళాలను ఉపయోగించాలి. ఇలా చేస్తే చంద్రగ్రహణ ప్రభావం తగ్గుతుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి, పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేస్తే మీరు సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించబడతాయి.
మీన రాశి : మీన రాశి వారు చంద్రగ్రహణ సమయంలో విష్ణువును పూజించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. రాశి వారికి జీవితంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు రావు. అంతేకాదు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి : చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. మన సమయంలో ఎటువంటి ఆహారము, నిరు తీసుకోకూడదు. ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. చంద్రగ్రహణం అనేది ఒక సహజ ఖగోలా దృగ్విషయం అని. దీని ప్రభావం అందరిపై భిన్నంగా ఉంటాయని ప్రజలు గమనించడం ముఖ్యం. మీకు ఈ చంద్రగ్రహణం గురించి ఎటువంటి సందేహాలు ఉన్న జ్యోతిష్య పండితులలో సంప్రదించవలసి ఉంటుంది.