Money Plant : మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే ఈ నియమాలు పాటిస్తేనే ప్రయోజనం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Money Plant : మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే ఈ నియమాలు పాటిస్తేనే ప్రయోజనం

 Authored By pavan | The Telugu News | Updated on :24 May 2022,7:40 am

Money Plant : చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ఉంటుంది. కొందరు దీనిని ఇంటి అందానికి పెట్టుకుంటారు. మరికొందరు మంచి జరుగుతుందని పెంచుకుంటారు. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని ఆశిస్తూ మనీ ప్లాంట్ పెంచుకుంటారు. చాలా మందికి వీటిని ఎలా పెంచాలో తెలిసే ఉంటుంది. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే దానిని పెంచే పద్ధతి. పెంచడం వేరు, పద్ధతిగా పెంచడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మనీ ప్లాంట్ విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవి కచ్చితంగా పాటిస్తేనే మనీ ప్లాంట్ వల్ల ఉపయోగం ఉంటుంది.

మనీ ప్లాంట్ కు సంబంధించి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక సూచనలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా మనీ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మనీ ప్లాంట్ ను ఎవరికైనా బహుమతిగా అసలే ఇవ్వకూడదు. ఈ మొక్క శుక్ర గ్రహానికి చెందినది. కాబట్టి మనీ ప్లాంట్ ను గిఫ్ట్ గా ఇస్తే.. ఇచ్చిన వారిని, తీసుకున్న వారిని శుక్రుడు బాధించవచ్చు. కాబట్టి ఎవరీ మనీ ప్లాంట్ ను బహుమతిగా ఇవ్వవద్దు. ఎవరైన పొరపాటున ఇచ్చినా ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకపోవడమే జీవితానికి మంచిది. శుక్ర గ్రహం అనుగ్రహం ఉంటే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అదే ఆగ్రహం ఉంటే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

do you have a money plant in your house however is beneficial to follow these rules

do you have a money plant in your house however is beneficial to follow these rules

మనీ ప్లాంట్ మొక్క పెరుగుతున్న కొద్దీ అందంగా కనిపిస్తుంది. అందుకే కొందరు ఇంటి బయట అలంకరణగా దీనిని పెంచుతారు. ఇలా అసలే చేయవద్దు. మనీ ప్లాంట్ ను ఇంట్లోనే పెంచుకోవాలి. బయట పెంచుకుంటే దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చిన్నగా ఉన్నా ఇంట్లో పెంచుకుంటేనే దాని ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో దాని ప్రభావం పడుతుంది. మరోక్క ముఖ్యమైన విషయం. మనీ ప్లాంట్ ను నేలపై పెంచకూడదు. భూమికి ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో మనీ ప్లాంట్ పెంచాలి. కుండీని వేలాడదీసి ఈ మొక్కను పెంచవచ్చు. కొందరు వాటర్ బాటిల్ ను వేలాడదీసి మనీ ప్లాంట్ పెంచుతుంటారు. ఇలా చేసినా మంచి లాభమే ఉంటుంది. అలాగే కిటీకీల వెంట కుండీలు పెట్టి పెంచినా మంచి ప్రయోజనం ఉంటుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది