Money Plant | ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే లాభాలే లాభాలు.. వాస్తు ప్రకారం ఇవి మీ జీవితాన్ని మార్చొచ్చు
Money Plant | ఇంట్లో లేదా పెరట్లో సులభంగా పెరిగే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి . ఇది మట్టి లేకుండా కేవలం నీటిలో పెంచవచ్చు. అందుకే చాలామంది ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు. కొందరు అందం కోసం పెంచితే, మరికొందరు వాస్తు నమ్మకంతో లేదా ఆర్థిక శ్రేయస్సు కోసం పెంచుతుంటారు. తాజాగా వాస్తు నిపుణులు, ఆరోగ్య నిపుణులు ఈ మొక్క వల్ల ఆరోగ్యపరమైన మరియు ఆర్థికపరమైన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు.
#image_title
మానసిక ప్రశాంతతకూ మనీ ప్లాంట్
వాస్తు నిపుణుల ప్రకారం, ఒత్తిడికి గురయ్యే వ్యక్తులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇంట్లో మనీ ప్లాంట్ తప్పకుండా పెట్టుకోవాలి. ఇది మంచి శుభఫలితాలను ఇస్తుందంట. మనసుకు ప్రశాంతతను అందించడమే కాదు, శరీరానికి చల్లదనం, ఆరోగ్యానికి ఉపశమనం కూడా ఇస్తుంది.
గాలి శుద్ధి చేయడంలో నెంబర్ వన్
మనీ ప్లాంట్ ఇంట్లో గాలిని శుద్ధి చేస్తుంది. వాతావరణంలో ఉండే హానికరమైన రసాయనాలు – ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జైలీన్ వంటి వాటిని నశింప చేస్తూ శుభ్రమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది ఇంట్లోని వాతావరణాన్ని ఆరోగ్యకరంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇంటికి అందం, మనసుకు చల్లదనం
ఈ మొక్క కేవలం ఆరోగ్యానికి ఉపయోగపడదని కాదు, ఇంటిని అందంగా మార్చడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇంటీరియర్ డిజైనింగ్‌లోనూ మనీ ప్లాంట్ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ మొక్కను చూసేటప్పుడే ఒత్తిడిని తగ్గించుకోగలమని నిపుణులు చెబుతున్నారు.
వాస్తు నిపుణుల ప్రకారం – ఏ ఇంట్లో మనీ ప్లాంట్ బాగా ఎదుగుతుందో, ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే సంపద సైతం పెరుగుతుందని నమ్మకం. అయితే, దీన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.