Silver Tortoise : ఇంట్లో వెండి తాబేలు పెట్టుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Silver Tortoise : ఇంట్లో వెండి తాబేలు పెట్టుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా.?

 Authored By prabhas | The Telugu News | Updated on :27 March 2023,7:00 am

Silver Tortoise : చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం గా కొన్ని విగ్రహాలను , ఫోటోలను అలాగే కొన్ని వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. వాటిని పెట్టుకోవడం వలన ఎన్నో లాభాలు కలుగుతాయని ధనం, ఆనందం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అయితే వాస్తు నియమాలు పాటించకపోతే మనిషిపై మానసికంగా మాత్రమే కాకుండా శారిరీక ప్రభావం కూడా పడుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో చాలా మంది వాస్తు పరిహారాలు వాస్తు ప్రకారం గా వస్తువులను పాటించే వారి సంఖ్య రోజుకి ఎక్కువవుతుంది. వాస్తు నియమాలను పాటించకపోతే ఆర్థికపరమైన సమస్యలు కూడా వస్తాయి.

Do you know the benefits of keeping a silver turtle at home

Do you know the benefits of keeping a silver turtle at home

అయితే వాస్తు దోషాల నుంచి అలాగే కష్టాల నుంచి ఉపశమనం పొందాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలి అని వాస్తు నిపుణులు చెప్తున్నారు.. అయితే ఇంట్లో వెండి తాబేలు కూడా ఒకటి పెట్టుకోవడం వలన డబ్బుకు లోటు అనేది ఉండదు. అలాగే శారీరిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. వ్యాపారంలో నష్టాలు ఉన్నవారు వెండి తాబేలుతో చేసిన ఉంగరాన్ని పెట్టుకుంటే అంత మంచే జరుగుతుంది. అయితే తాబేలు పచ్చిపాలతో పూజించిన తర్వాతనే చేతికి ధరించాలి. ఇంట్లో వెండి తాబేలు విగ్రహాన్ని ఉత్తరం దిశలో పెట్టుకోవడం వలన అన్ని శుభాలే జరుగుతాయి.

Japanese Silver Tortoise, ca. 1900 | Myrtle Beach, Hour 3 Preview - YouTube

తాబేలు ఉత్తరాన ఉంచితే పాత్రలో కొంచెం నీరు పోసి దాన్లో తాబేలుని ఉంచాలి. అదేవిధంగా పిల్లలు ఎంత చదివినా చదువులో ఆశించని ఫలితాలు పొందలేకపోతే వెండి తాబేలు వారు చదువుకుంటున్న స్థలంలో పెడితే పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ప్రశాంతంగా చదువుపై దృష్టి పెడతారు. అలాగే పిల్లలు కూడా చదువులో విజయాన్ని అందుకుంటారు. ఈ విధంగా వెండి తాబేలు ఇంట్లో పెట్టడం వలన ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో ఆనందం శ్రేయస్సు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది