Astro News : పిండితో చేసిన దీపం దేవుడి దగ్గర వెలిగించడం వలన ఏమవుతుందో తెలుసా మీకు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astro News : పిండితో చేసిన దీపం దేవుడి దగ్గర వెలిగించడం వలన ఏమవుతుందో తెలుసా మీకు..?

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2022,6:00 am

Astro News : హిందూ సాంప్రదాయాలలో దీపాన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. ఈ దీపాన్ని జ్ఞానానికి గుర్తుగా అనుకుంటూ ఉంటారు. చాలామంది గృహంలో ఇత్తడి, రాగి, మట్టితో చేసిన కుందులలో దీపారాధన చేస్తూ దేవుడిని కొలుస్తూ ఉంటారు. కొన్ని శుభ సమయాలలో పిండితో చేసిన ప్రమిదలలో దీపాలని వెలిగిస్తూ ఉంటారు. అయితే దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… పురాతన కాలం నుంచి దీపం వెలిగించకుండా పూజ పూర్తి కానట్లే అని భావిస్తూ ఉంటాం. కొన్ని శుభ సమయాలలో ముఖ్యమైన సందర్భాలలో నాలుగు ఐదు దీపాలని పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. ఇలా కాకుండా ముఖ్యమైన వత్తి ఆవాల నూనెతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీనికోసం మట్టి ప్రమిద, పిండి ప్రమిద కూడా ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా నిత్యం వెలిగించడం వలన శ్రేయస్సు , సుఖ సంతోషాలు ఆ ఇంట్లో ఉంటాయని నమ్ముతారు. అగ్నిదేవుని సాక్షిగా ఏ పని మొదలుపెట్టిన విజయం చేకూరాలని చెప్తూ ఉంటారు.

శరీరం సృష్టికి మూలమైన ఐదు మూలకాలలో అగ్ని కూడా ఒకటి. దీపాన్ని జ్ఞానానికి గుర్తుగా భావిస్తూ ఉంటారు. దీని వెనుక ప్రత్యేక మూలకం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో పిండి ప్రమిదలు చేసిన జ్యోతి చాలా పవిత్రమైనది అని చెప్తుంటారు. ఈ దీపం జీవితంలో ఎన్నో సమస్యలను కూడా అధిగమించగలదు. ఈ పిండి దీపం వెలిగించడం వలన ధనవంతులుగా మారి మార్గాలలో ఒకటి పిండి దీపం. ఇది వెలిగించే సరైన మార్గాన్ని ఇప్పుడు మనం చూద్దాం… ముఖ్యమైన సందర్భాలలో పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు సహజంగా కోరికలను తీర్చుకోవడం కోసం కూడా ఈ పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇక దానికోసం ఎప్పుడు పిండి దీపాల సంఖ్యను పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటారు. అంటే 11 రోజులు దీపాలు వెలిగిస్తే ఫస్ట్ రోజు 11 దీపాలు రెండో రోజు 10 దీపాలు చివరి రోజు ఒక దీపం మాత్రమే వెలిగిస్తుంటారు. ఇలా మొదలుపెట్టినట్టు అయితే చివరి రోజున 11 దీపాలు వెలిగించండి. ఇవి కాకుండా మీ కోరిక విధానంగా మీకు ఇష్టమైన దైవం దగ్గర దీపారాధన చేయండి.

Do you know what happens when a lamp made of flour is lit before God

Do you know what happens when a lamp made of flour is lit before God

ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడాలి అనుకునేవాళ్లు ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి దగ్గర తీర్మానం చేసి 11 రోజుల వరకు తగ్గుతున్న, పెరుగుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించండి. ఈ విధంగా చేస్తే తొందరగా ఆర్థిక పరిస్థితులు అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతుంటే బజరంగ్ బలి దగ్గర పిండి దీపు వెలిగించండి. దాంతో ఆస్తి సంబంధిత ఇబ్బందులు కూడా పోతాయి. అయితే పదేపదే ధన నష్టం వస్తుంటే శని దేవుని దగ్గర పిండి దీపం పెట్టండి. ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు కి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అన్నపూర్ణ దేవి ముందు పిండి దీపాలు పెట్టడం వలన గృహం సిరిసంపదలతో తులతూగుతుంది. ఒకవేళ జాతకంలో రాహు కేతు దోషాలు ఉంటే పూజ గదిలో పిండి దీపం పెట్టండి శనివారం రోజు ఆవనున్నతో దీపం పెడితే శని గ్రహ దోషాలు కూడా పోతాయి. పిండిలో పసుపు కలిపి ప్రమిద చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విష్ణు ఆశీర్వాదం దొరుకుతుంది. దురదృష్టం అదృష్టంగా మారిపోతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన శ్రేయస్సు ఆనందం కలుగుతుంది. దీంతోపాటు ప్రతి పనిలోనూ విజయం మొదలవుతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది