Garuda Puranam : గరుడ పురాణంలో పునర్జన్మ గురించి ఏం చెప్పబడిందో తెలుసా….? అసలు పునర్జన్మ అంటే ఏంటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda Puranam : గరుడ పురాణంలో పునర్జన్మ గురించి ఏం చెప్పబడిందో తెలుసా….? అసలు పునర్జన్మ అంటే ఏంటి…?

 Authored By ramu | The Telugu News | Updated on :2 May 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Garuda Puranam : గరుడ పురాణంలో పునర్జన్మ గురించి ఏం చెప్పబడిందో తెలుసా....? అసలు పునర్జన్మ అంటే ఏంటి...?

Garuda Puranam : హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ఒక పురాణిక గ్రంథం. ఇందులో జననం, మరణం, పునర్జన్మ వంటి విషయాలు స్పష్టంగా వివరించబడ్డాయి. గ్రంథాన్ని చదవడం ద్వారా మనకు జీవితం, కర్మ, ధర్మం గురించి లోతైన అవగాహన కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగటానికి మార్గాన్ని చూపుతుంది గరుడ పురాణం. గరుడ పురాణంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ముఖ్యమైన గ్రంథం. కృష్ణమూర్తి స్వయంగా గరుత్మంతునికి బోధించిన సమూహం. ఇందులో జననం,మరణం, ఆత్మ ప్రయాణం అంటే విషయాలు వివరంగా వివరించబడ్డాయి. గ్రంధాన్ని చదివితే జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.

Garuda Puranam గరుడ పురాణంలో పునర్జన్మ గురించి ఏం చెప్పబడిందో తెలుసా అసలు పునర్జన్మ అంటే ఏంటి

Garuda Puranam : గరుడ పురాణంలో పునర్జన్మ గురించి ఏం చెప్పబడిందో తెలుసా….? అసలు పునర్జన్మ అంటే ఏంటి…?

Garuda Puranam  గరుడ పురాణంలో పునర్జన్మను గురించి లోతుగా వివరిస్తూ

గరుడ పురాణంలో పునర్జన్మ గురించి లోతుగా వివరిస్తూ.. శరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి తన కర్మ ఫలాల ఫలితంగా మరొక జన్మను పొందుతుంది. గరుడ పురాణంలో, శరీరాన్ని విడిచిన ఆత్మ, తిరిగి ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో పునర్జన్మను ఎత్తగలదో, ఇందులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది.ఇదంతా మనం చేసిన కర్మ ఫలం ఫలితమే. నిజానికి మనం చేసిన ధర్మ ఫలాలను బట్టి మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది. మనం చేసిన పనులకి తగిన ప్రతిఫలం మనము అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి, మనం ఈరోజు చేసే పనులు రేపటి ఫలితాలను నిర్ణయిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు పలితాలు కలుగుతాయని గరుడ పురాణంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

గరుడ పురాణంలో యమధర్మరాజు, మనిషి ఆత్మను తన వద్దకు తీసుకువెళ్లి ఆ ఆత్మ చేసిన కర్మల చిట్టాను చిత్రగుప్తుడు పరిశీలిస్తాడు. ఆత్మ జీవించి ఉన్నప్పుడు మంచిగా జీవించిందా లేదా చెడు మార్గంలో నడిచిందా అని ఆయన నిర్ణయిస్తాడు. పనులు చేసే వారికి ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి. చెడు పనులు చేసే వారి ఆత్మను నరకానికి పంపబడుతుంది. గరుడ పురాణంలో మోక్షమార్గాన్ని కూడా వివరించడం జరిగింది. దీని ప్రకారం సత్యాన్ని అనుసరించాలి. భగవంతునిపై భక్తిని లేదా ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈ మార్గంలో నడిచే వ్యక్తి జననం మరణాల చక్రం నుండి విముక్తి పొందుతాడు. గరుడ పురాణంలో చెప్పినట్లు ఆత్మ శాశ్వతం. ఇది శరీరాన్ని మాత్రమే మార్చుతుంది. శరీరం చనిపోతే ఆత్మ మరొకదాన్ని పొందుతుంది. ఇది ఎప్పటికీ ఉండేశుద్ధమైన శక్తి. గరుడ పురాణంలో ప్రేతాత్మల గురించి కూడా వివరించారు. కొన్ని ఆత్మలు తమ పని పూర్తి చేయకపోవడంతో శాంతి పొందలేదు. అవి భూమి పై ఉండే సంచరిస్తుంటాయి. ఇవి తమ కర్మల ఫలితంగా దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధర్మాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఇది జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతతతో ఉంటాడు. పురాణం మనకు ఆధ్యాత్మికంగా ఎదగడం ఎలా అనే విషయాన్ని నేర్పడుతుంది.కర్మ గురించి అవగాహన పెరుగుతుంది. జీవితంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది. గరుడ పురాణం మన జీవితానికి దిక్సూచి లాంటిది. కేవలం గ్రంథం కాదు, జీవితం ఎలా నడిపించాలో నేర్పే మార్గదర్శిని కూడా. దీన్ని చదవడం వల్ల మన ఆత్మకు ఏ వైపు వెళ్లాలో తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది