Garuda puranam Truths : గరుడ పురాణంలో జీవితాంతం గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే…ఇలా చేయకండి లేదంటే నరకానికి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda puranam Truths : గరుడ పురాణంలో జీవితాంతం గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే…ఇలా చేయకండి లేదంటే నరకానికి…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2025,8:00 am

Garuda Puranam Truths : గరుడ పురాణంలో మనిషి జీవిత కాలం నుంచి మరణం సంభవించిన తరువాత కూడా మనిషి ఆత్మ ప్రయాణం గురించి గరుడ పురాణంలో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మనిషి చేసే పాపాలు, పుణ్యాల వంటి అంశాలపై స్పష్టమైన దిశా నిర్దేశాన్ని ఇస్తుంది. పురాణంలో పేర్కొన్న నీతి, పాపాల వివరాలు మన జీవితాన్ని సద్గుణాలతో నడిపించేందుకు ఉపయోగపడతాయి. ధర్మబద్ధంగా జీవించి, చెడు చర్యల నుండి దూరంగా ఉండాలని సందేశం ఈ గరుడ పురాణంలో నిక్షిప్తమై ఉంది. చూడ పురాణంలో మానవుని జీవితం, మరణం తర్వాత దశలు, పుణ్యం పాపం గురించి వివరంగా తెలియజేయడం జరిగింది. గ్రంథం ప్రకారం మనం జీవితంలో చేసే పనులు ప్రభావం మరణం తర్వాత కూడా ఉంటుంది.ఆత్మను మంచి పనులు చేస్తే పరలోకానికి తీసుకెళ్తే, చెడు పనులు నరకానికి తీసుకెళ్తాయి. ఈ గ్రంథంలో మనం జీవితంలో చేసే మంచి చెడులో ప్రభావం మరణం తర్వాత కూడా ఉంటుంది.

Garuda puranam Truths గరుడ పురాణంలో జీవితాంతం గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవేఇలా చేయకండి లేదంటే నరకానికి

Garuda puranam Truths : గరుడ పురాణంలో జీవితాంతం గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే…ఇలా చేయకండి లేదంటే నరకానికి…?

Garuda puranam Truths చూడ పురాణం అసలు ఏం చెబుతుంది

ప్రత్యేకమైన పనులు మనిషిని నరకానికి దారి తీస్తాయి. ఇలాంటి పనులు మనం అస్సలు చేయకూడదు. జీవితంలో ధర్మబద్ధంగా నడవాలి. ఇప్పుడే మనం నరక బాధల నుండి బయటపడగలం.

ఎవరైనా సరే నిత్యం అబద్ధాలు చెబుతూ ఇతరులను మోసం చేస్తే అది తీవ్రమైన పాపం గా పరిగణించడం జరిగింది. ఆంటీ వ్యక్తులకు నరకంలో స్థానం ఉంటుంది. అక్కడ చిత్రహింసలు పడతారు.
. తల్లిదండ్రులు, పెద్దలు, కుటుంబ సభ్యులను గౌరవించని వ్యక్తి పాపం చేసినట్లే.. ఇలాంటి వారు కూడా నరకానికి అర్హులే.
. అందరూ అమాయకులపై హింస చేయడం లేదా వారికి హాని చేయడం చాలా పెద్ద పాపంగా భావించబడుతుంది. ఎవరు అలాంటి పని చేస్తారు వారు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది.
. నరుల ఆస్తిని కోరుకోవడం, దాన్ని పొందడానికి ప్రయత్నించడం కూడా ఒక పాపమే. దురాశకు చిహ్నం. వ్యక్తికి కూడా నరకం తప్పదు.
. తనను తాను గొప్పవాడిగా భావించి, గర్వంతో ప్రవర్తించే వారిని గరుడ పురాణంలో తప్పు చేసే వానిగా చూపిస్తుంది. ఇది కూడా పాపమే.

. వేదాలు,పురాణాలు వంటి మంత్ర గ్రంథాలను గౌరవించకుండా ప్రవర్తించేవారు వాటిని తక్కువగా చూసేవారు కూడా నరకానికి అర్హులవుతారు.
. ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతూ అసత్యం ఆడని వారు నరకానికి వెళ్ళరు.
. వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షణ చూపడం, వ్యామోహంగా భావించడం కూడా పాపంగా పరుగనించడం జరిగింది. పరాయి స్త్రీ వ్యామోహం నరకానికి పంపిస్తుంది.
. మత పరమైన పండుగలు, ఆచారాలు పాటించకుండా ఉండటం తప్పుగా. భావించబడుతుంది. ఇది కూడా పాపంగానే పేర్కొనబడింది.
. తల్లిదండ్రుల పట్ల చెడుగా ప్రవర్తించడం, వారికి సేవ చేయకపోవడం నరకానికి తీసుకెళ్తుంది. మన జీవితంలో తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయం.
. పాపానికి తావిచ్చే ఆలోచనలు లేదా చెడు పనులు పట్ల ఆసక్తి చూపించే వ్యక్తికి కూడా గరుడ పురాణంలో నరకానికి అర్హుడు అవుతున్నాడు.
. పురాణంలో మనిషికి ఒక స్పష్టమైన మారదర్శకం. జీవితమంతా మంచి పనులు చేస్తూ, సత్యం, గౌరవం, ధర్మం అనే మార్గాల్లో నడవాలి. మాత్రమే మనం నరకం అనే బాధ నుంచి బయటపడగలం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది