SravanaMasam : శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా… అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SravanaMasam : శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా… అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  SravanaMasam : శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా... అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట...?

SravanaMasam : రమణ మాసం అంటేనే ఆధ్యాత్మిక తో నిండి ఉంటుంది.అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక రకమైన వాతావరణం నెలకొంటుంది. అత్యంత పవిత్రంగా భావించే ఈ శ్రావణ మాసంలో శివునికి అంకితం చేయబడింది. ఈ సమయంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుని ఆరాధిస్తారు.అయితే శివ భక్తులను కొన్ని నియమాలు పాటిస్తుంటారు. వాటిని భక్తిశ్రద్ధలతో పాటిస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు పాటు నాన్ వెజ్ ని అస్సలు తినకూడదని చెబుతుంటారు. ఈ సాంప్రదాయం వెనుక మతపరమైన కారణాలు మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలు అంటే సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది.

SravanaMasam శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట

SravanaMasam : శ్రావణమాసంలో నాన్ వెజ్ ని ఎందుకు తినకూడదో తెలుసా… అసలు సైంటిఫిక్ రీసన్ ఇదేనట…?

SravanaMasam వనమాసంలో మాంసాహారాన్ని భుజించక పోవడానికి గల కారణాలు

వనమాసంలో మాంసాహారాన్ని స్వీకరించకపోవడానికి గల కారణం సైంటిఫిక్ రీసన్ కూడా ఉంది. శ్రావణమాసం వచ్చేసరికి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో సూర్య రష్మి,వెలుతురు ఎక్కువగా ఉండదు. కాబట్టి మన శరీరంలో జీర్ణక్రియ వేగంగా జరగదు ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీన పడుతుంది. దీనివల్ల భారీ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా అవుతుంది. వేద గ్రంధాలలో వర్షాకాలంలో ఆహారం జీవనశైలికి నియమాల రూపొందించబడ్డాయి. ఆకుకూరలు,కూరగాయలపై కూడా ఆహారంలో ఆంక్షలు విధించబడ్డాయి. ఎందుకంటే వాటిలో పురుగులు ఉండవచ్చు. జీర్ణశక్తి బలహీనపరచడం వల్ల ఏం తిన్నా కూడా అరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మాంసం వంటి కఠినమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ కాలంలో జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా అవుతుంది. శ్రావణమాసంలో శాఖాహారం తింటే మంచిదని చెబుతుంటారు నిపుణులు.

వర్షా కాలంలో నీరు కూడా చాలా కలుషితంగా అవుతుంది. ఈ వాతావరణం లో నీటిలో నివసించే చేపలు లేదా కలుషిత నీటిపై ఆధారపడిన అనేక జంతువులు తెలియకుండానే,వివిధ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు గురవుతుంటాయి.అలాంటి చేపలు రొయ్యలు వంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఈ వాతావరణం లో మాంసం చేపలు త్వరగా కుళ్ళిపోతాయి వీటిలో బ్యాక్టీరియా ఫంగస్ బాగా వృద్ధి చెందుతుంది. కాబట్టి దీనిని ఆహారంగా భుజిస్తే ఫుడ్ పాయిజనింగ్ కడుపు సంబంధిత వ్యాధులు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువే.

SravanaMasam మాంసం, చేపలు ఎందుకు నిషేధం

మాంసాహారం, చేపలు కఠినమైన ఆహారంగా పరిగణించబడినవి.దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీసన్ ఏమిటంటే ఈ ఆహారాన్ని భుజించడం వల్ల సోమరితనం, బద్ధకం, అహంకారం,కోపం పెరుగుతాయి. ఈ కారణాలన్నీటి వల్ల ప్రజలు ఆధ్యాత్మికతనుండి దూరం అవుతుంటారు. ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి ఆహారంపై నియంత్రణ అవసరమని చెప్పబడింది.ఇటువంటి ఆహారాలు సాత్వికతను దూరం చేస్తాయి. పూజ సమయంలో ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.ఈ కారణాలన్నీటి వల్ల నాన్వెజ్ నీ నిషేధించడం జరిగింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది