Lakshmi Devi : హిందూ సాంప్రదాయాలలో వారంలోని ఒక్కో రోజుని ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున చేసే పనుల వలన లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలు కురిపిస్తుందని నమ్మకం. అలాగే ఈ రోజున కొన్ని పనులు చేస్తే ధనలక్ష్మి ఇంటికి వస్తుందని పెద్దలు అంటారు. ఒకవేళ లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే భక్తులకు దరిద్రం పడుతుంది. ధనవంతుల నుంచి పేదవాడిగా మారిపోతారు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఏ వస్తువులను కొనకూడదు మరియు ఇంటికి తీసుకురకూడదు. ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
– శుక్రవారం రోజున కొన్ని రకాల వస్తువులను కొనడం వలన ఐశ్వర్య అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు.
– శుక్రవారం రోజున వంటగదికి సంబంధించిన వస్తువులను అసలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.
– ముఖ్యంగా శుక్రవారం రోజున ఆస్తి లావాదేవీలను చెయ్యకూడదు. ఈ రోజున వీటికి దూరంగా ఉండడం మంచిది. లేకపోతే కుటుంబ సభ్యులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
– శుక్రవారం రోజున స్వీట్లు ఇవ్వడం వంటివి చేయకండి. ఇలా చేస్తే జాతకంలోని శుక్రుడు బలహీన పడతాడు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది.
– శుక్రవారం రోజున డబ్బులను అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి అసలు చేయకూడదు. డబ్బుల విషయంలో ఇలా చేస్తే లక్ష్మి దేవికి కోపం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
– శుక్రవారం రోజు పొరపాటున కూడా ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఎందుకంటే పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ఇంటి పూజా గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
– ఇంట్లో చిరిగిన మరియు మురికి బట్టలు ధరించకూడదు. నవ గ్రహాలలో ఛాయా గ్రహం రాహువుకి ఆగ్రహం కలిగిస్తుంది. కాబట్టి రాహువు కారణంగా ఆ వ్యక్తీ ఆరోగ్యానికి హాని కలగవచ్చు. కావున శుక్రవారం రోజున శుభ్రమైన దుస్తులను ధరించాలి. దీంతో లక్ష్మిదేవి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.