Pitru Paksha : రేపటి నుంచి 15 రోజులపాటు పొరపాటున ఈ పనులు అస్సలు చేయకండి… నష్టపోతారు…!
ప్రధానాంశాలు:
Pitru Paksha : రేపటి నుంచి 15 రోజులపాటు పొరపాటున ఈ పనులు అస్సలు చేయకండి... నష్టపోతారు...!
Pitru Paksha : సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అని పిలుస్తారు. ఇక ఈ పితృపక్ష సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ వారికి ఆహారాలను సమర్పిస్తారు. ఇక ఈ పితృపక్షం అనేది దాదాపు 15 రోజులు పాటు ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకులు వారి వారసులను కలవడం కోసం భూమి మీదకు వస్తారనేది సనాతన ధర్మంలో ఒక దృఢమైన నమ్మకం. మరి ఈ సమయంలో కొన్ని రకాల తప్పులు చేయడం వలన పితృ దోషం బారిన పడే అవకాశం ఉంటుందట. మరి ఈ సమయంలో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Pitru Paksha : మగవారు చేయకూడని పనులు…
పితృపక్షం సమయంలో స్నానం, దానం, తర్పణం , తదితర కర్మలు చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని వారి ఆశీర్వాదాలు పొందగలుగుతారని నమ్మకం. అయితే ఈ పితృపక్ష సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ముఖ్యంగా మగవారు కొన్ని పనులు చేస్తే పితృ దోష బారిన పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలియక తప్పు చేసిన పూర్వీకుల ఆగ్రహానికి గురికాక తప్పదు. అయితే ఈ పితృపక్ష సమయంలో శుభకార్యాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే పితృపక్ష సమయంలో పురుషులు కొత్త వస్తువులు లేదా కొత్త బట్టలు అస్సలు కొనుగోలు చేయకూడదు. అంతేకాక ఈ సమయంలో కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మద్యం , మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి.
Pitru Paksha ఇలా చేస్తే ఆర్థిక నష్టాలు తప్పవు….
ఇక ఈ పితృపక్ష సమయంలో పొరపాటున మీరు జుట్టు కత్తిరించుకోకూడదు. అలాగే గడ్డం కూడా చేసుకోరాదు. ఈ విధంగా చేయడం వలన ఆర్థికంగా నష్టపోతారని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు పితృపక్ష సమయంలో కర్మలకు వంట చేసే పాత్రల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు వహించాలి. పొరపాటున కూడా ఇనుప పాత్రలను ఉపయోగించకూడదు. రాగి ఇత్తడి వంటి పాత్రాలను ఉపయోగించాలి. అంతేకాదు పితృపక్ష సమయంలో తయారు చేసే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి వంటివి చేర్చడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి పనులు పితృపక్ష సమయంలో చేయడం ఏమాత్రం మంచిది కాదు. పితృపక్ష సమయంలో ఎలాంటి శుభకార్యాలు ఇంట్లో జరగకుండా చూసుకోవాలి. పితృదేవులకు ఆగ్రహం తెప్పించే పనులు చేస్తే ఖచ్చితంగా పితృ దోషానికి గురవుతారు. తద్వారా కుటుంబానికి ఆర్థిక నష్టాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు కావున పితృపక్ష సమయంలో ఏవైనా పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా తెలుసుకొని చేయడం మంచిది.