Pitru Paksha : పితృపక్ష సమయంలో పూర్వీకులు కలలోకి వస్తే ఏం జరుగుతుంది… శాస్త్రం ఏం చెబుతుందంటే..!
Pitru Paksha : పితృపక్షంలో శ్రద్ధ కర్మలను నిర్వహించే 16 రోజుల్లో 10 రోజులు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే 16 రోజుల పితృపక్ష సమయంలో పూర్వీకులకు నిర్మలమైన హృదయంతో పిండ ప్రదానం చేస్తే పూర్వీకుల ఆశీర్వాదాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. ఇక పితృపక్ష సమయంలో పూర్వికులు తమ వారసులు చేసే చర్యల వలన వారు సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఇక అలాంటి సూచనలలో కల ఒకటి. పితృపక్ష సమయంలో పూర్వీకులు […]
ప్రధానాంశాలు:
Pitru Paksha : పితృపక్ష సమయంలో పూర్వీకులు కలలోకి వస్తే ఏం జరుగుతుంది... శాస్త్రం ఏం చెబుతుందంటే..!
Pitru Paksha : పితృపక్షంలో శ్రద్ధ కర్మలను నిర్వహించే 16 రోజుల్లో 10 రోజులు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే 16 రోజుల పితృపక్ష సమయంలో పూర్వీకులకు నిర్మలమైన హృదయంతో పిండ ప్రదానం చేస్తే పూర్వీకుల ఆశీర్వాదాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. ఇక పితృపక్ష సమయంలో పూర్వికులు తమ వారసులు చేసే చర్యల వలన వారు సంతోషంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఇక అలాంటి సూచనలలో కల ఒకటి. పితృపక్ష సమయంలో పూర్వీకులు మీ కలలోకి వచ్చి ఏదైనా చెప్పినట్లు లేదా సూచించినట్లు అనిపిస్తే అది పూర్వికులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా లేదా విచారంగా ఉన్నారా అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి పూర్వీకులు కలలో ఎలాంటి సూచనలను ఇస్తారు. అలాగే ఆ కల యొక్క అర్థం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Pitru Paksha పూర్వికులు కలలో మిమ్మల్ని ఆశీర్వదిస్తే..
తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావిస్తారు. దీనికంటే గొప్పది మరి ఏదీ లేదు. అయితే వారి ఆశీర్వాదాలు మనిషికి కవచం లాంటిది. ఇక పితృపక్ష సమయంలో పూర్వికులు మీ కలలోకి వచ్చి వారి దీవెనలను ఇస్తే వారికి మీ పట్ల ఎంతో దయ ఉందని అలాగే మీరు చేసే పనిలో వారు మీకు అండగా ఉంటారని దీంతో మీరు విజయం సాధిస్తారని అర్థం. అంతేకాకుండా రానున్న రోజుల్లో మీ జీవితంలోకి డబ్బు రాబోతుందని సంకేతం.
పూర్వికులు కలలో ప్రశాంతంగా కనిపిస్తే…
పూర్వికులు మీ కలలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నట్లుగా కనిపిస్తే అది శుభసంకేతంగా పరిగణించవచ్చు. ఎందుకంటే వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని అర్థం. అదేవిధంగా మీ భవిష్యత్తులో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. అయితే ఈ శుభవార్త సంపద విషయంలో కావచ్చు లేదా సంతాన గురించి సంతోషకరమైన వార్త కావచ్చు. లేదా మరి ఏదైనా మంచి శుభవార్తని వినవచ్చు.
పూర్వికులు కలలో నవ్వుతూ కనిపిస్తే…
ఒకవేళ మీ కలలో పూర్వికులు నవ్వుతూ కనిపిస్తే అది శుభసంకేతంగా పరిగణించబడుతుంది. మీరు పితృపక్ష సమయంలో పూర్వికులకు చేసిన చర్యల వలన సంతోషంగా ఉన్నారని అలాగే వారి ఆశీర్వాదాలు మీతో ఎప్పుడూ ఉంటాయని ఈ కల యొక్క అర్థం. అయితే వారి ఆశీర్వాదాలు వలన మీరు జీవితంలో కొన్ని శుభవార్తలను వింటారు. ఇక ఈ శుభవార్త ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండవచ్చు. లేదా ధన లాభానికి సంబంధించిన సంకేతం కావచ్చు. కాబట్టి మీ పూర్వీకుల వలన మీకు మంచి జరుగుతుందని ఈ కలలు తెలియజేస్తాయి.