Donate : పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులు దానం చేయకండి.. దరిద్రం పట్టుకుంటుంది ..!!
Donate : ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులను అస్సలు దానం చేయకూడదు అని అంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈ ఐదు వస్తువులను దానం చేస్తే ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా హిందువులు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాంటి చీపురుని దానం చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లో ఉన్న కాస్త ధనం కూడా నిలబడదు. తర్వాత కొబ్బరి నూనెను మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు చేతులతో రాయకూడదు. అలాగే ఉచితంగా కూడా దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి వారితోపాటు బయటికి వెళ్లిపోతుంది. అలాగే కత్తులు, సూదులు, చాకులు వంటివి ఎవరికి దానం చేయకూడదు.
ఇలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది. ఏది చేసినా కలిసి రాదు. భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువ అవుతాయి ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు జరుగుతాయి. కనుక ఇలాంటి వస్తువుని బయటి వారికి అస్సలు దానం చేయకూడదు. ఆ తర్వాత పాడైపోయిన ఆహార పదార్థాలు అస్సలు దానం చేయకూడదు. ఇలా చేయడం వలన కోర్టుకు సంబంధించిన కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైతే పాడైపోయిన ఆహారాన్ని దానంగా ఇస్తారో వారు కోర్టు కేసులో ఇరుక్కొని వాటితో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అలాగే వారి దగ్గర ఉండే డబ్బులు కూడా పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కూడా నిలబడదు. ఇక చాలామంది ఇంట్లో పగిలిపోయిన వస్తువులు, చిరిగిపోయిన దుస్తులు దాచుకుంటారు. కానీ ఇలా చేయడం వలన దరిద్రం వెన్నంటే ఉంటుంది. అలా ఉంటే డబ్బులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలబడదు. అలా చేయడం వలన అదృష్టం అనేది కలిసి రాదు. ఈ సమయంలో మనం ఏం చేసినా చెడే ఎదురవుతుంది. కనుక మనం ఇంట్లో పగిలిపోయిన వస్తువులు, చిరిగిన దుస్తులు ఉంటే వెంటనే వాటిని తీసివేయాలి.