Solar Eclipse : సూర్య గ్రహానికి ముందు రోజులలో తులసమ్మ దగ్గర ఈ పొరపాట్లు చేయకండి… మహా పాపం చుట్టుకున్నట్లే…!
Solar Eclipse : ఈ నెలలో దీపావళి 26 ప్రారంభం కానున్నది. అయితే ఆ రోజున సూర్యగ్రహం ఉండడంతో సోమవారం నాడు దీపావళిని జరుపుకోబోతున్నారు.. అయితే ఈ సూర్య గ్రహణానికి ముందు కొన్ని పనులను చేయకూడదు. అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తూనే ఉంటారు. అయితే సూర్య గ్రహానికి 12 గంటల ముందు నుంచి సూతకం మొదలవుతుంది. ఈ సూతకం మొదలైనప్పటికీ నుండి గ్రహణం ముగిసే వరకు శుభ సమయం కాదు. కావున ఈ టైంలో పూజలు ఇతర ఏ శుభకార్యాలు కూడా చేయకూడదు.. తినడం ,తాగడం కూడా చేయకూడదు. సూతకం మొదలైన వెంటనే దేవుళ్ళ ఆలయాలు మూసేస్తుంటారు.
అయితే సూతకానికి మునిపే తులసి ఆకులను ఆహారం పానీయాలతో ఉంచడం జరుగుతుంది. ఇందు సాంప్రదాయాలలో తులసిని భగవంతునితో సమానంగా ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసిమ్మను ఉంచి ఆరాధిస్తూ ఉంటారు. శుభకార్యంలో తులసి ఆకులకు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. దేవుళ్ళకి ఏదైనా ప్రసాదం పెట్టే టైంలో కూడా ఈ తులసి ఆకులను అందులో కలుపుతూ ఉంటారు. ఇక ఈ ఏడాది దీపావళి సందర్భంగా సూర్యగ్రహణం ఏర్పడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. మంగళవారం అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీపావళి మరుసటి రోజు ఆహారం, పానీయాల స్వచ్ఛతను కాపాడడానికి తులసి ఆకులను వేస్తూ ఉంటారు.
అయితే సూర్యగ్రహానికి రెండు రోజుల మునిపే తులసిని ముట్ట వద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తులసి ఆకులను తెంపటం అరిష్టమని శాస్త్రం తెలియజేస్తుంది. సూర్య గ్రహానికి ముందే తులసి ఆకులను తెంపడం బ్రహ్మను చంపిన పాపం వస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అక్టోబర్ 23వ తేదీ ఆదివారం నుండి తులసి ని తులసి ఆకులని ముట్టుకోవద్దని ఈ రెండు రోజులలో తులసి నీ ముట్టినట్లయితే… మహా పాపం చుట్టుకుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు గట్టిగా చెప్తున్నారు.. కావున ఆదివారం రోజు 12 గంటల లోపు తులసి ఆకుల్ని తెంపుకోవచ్చు.. తర్వాత తులసిని కానీ తులసి ఆకులు కానీ అస్సలు ముట్ట వద్దు.. అలా ముట్టినట్లయితే వారికి మహా పాపం చుట్టుకుంటుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి..