Aashada Masam : ఆషాడ మాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి .. మహా పాపం చుట్టుకుంటుంది ..
Aashada Masam : తెలుగు మాసాలలో ఒక్కటైన ఆషాడ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. కానీ ఈ సమయంలో పితృ కార్యాలు, జప హోమాలు చేయడానికి శుభప్రదమైనది. ఆషాడ మాసంలో రాగి పాత్రలో నీళ్లు, అక్షింతలు, పూలు రోలి పోసి సూర్య భగవానుడిని ఆర్జ్యం సమర్పించే సాంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఇలా చేయడం వలన సూర్య భగవానుడు ముక్తిని పొందుతారు. ఈ మాసంలో గొడుగు, ధాన్యం, డబ్బులు దానం చేస్తే చాలా మంచిది. ఇక ఈ మాసంలో అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అందుకే గ్రామాలలో ఉన్న దేవతలకు ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తే మన వద్దకు ఎటువంటి వ్యాధులను దరిచేరకుండా చూస్తుంది.
దక్షినాయణంలో పెళ్లిళ్లు చేయరు యజ్ఞాలు హోమాలు కూడా చేయరు. ఉపవాసాలు కూడా చేయకూడదు. దేవతలు నిద్రావస్థలో ఉంటారు కాబట్టి చేయకూడదు అంటారు. ఈ సమయంలో ఉపవాసాలు తర్పణాలు దానాలు చేయమని చెబుతుంటారు. ఆషాడ గురువారాలు, అమ్మవారి ఆర్జన ఎంతో విశిష్టమైనవి. ఆషాడ ఆదివారాలు దుర్గాదేవికి, ఆషాడ గురువారాలు లక్ష్మీదేవినీ పూజిస్తారు. ఈ మాసంలో ఏ అమ్మవారి దేవాలయానికైనా వెళ్లి దీపం పెట్టి నమస్కారం చేసుకొవాలి. గుళ్ళల్లో బోనాలు సమర్పిస్తారు. కొన్నిచోట్ల అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తారు కొన్నిచోట్ల ఒడి బియ్యం ఇస్తారు.
గ్రామాలలో పసుపు కుంకుమ వేపాకులు వేయడం వలన గ్రామం శుభ్రం అవుతుదని నమ్మకం. వేపాకులు ఇంటికి కట్టడం వలన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు. ఆషాడ మాసం అంటే వర్ష ఋతువు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అంటూ వ్యాధులు దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసంలో అమ్మవారిని ప్రసన్నం చేసేందుకు బోనాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో గ్రామదేవతలు ఊరిని కాపాడుతాయి. ఆషాడమాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. పితృ తర్పణాలు , యజ్ఞ హోమాలు చేస్తారు.