Budhadithya Yoga : 12 రోజులపాటు బుధాదిత్య యోగం… ఈ రాశుల వారికి వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం
ప్రధానాంశాలు:
Budhadithya Yoga : 12 రోజులపాటు బుధాదిత్య యోగం... ఈ రాశుల వారికి వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం
Budhadithya Yoga : గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17 వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అంటే 12 రోజులపాటు తులా రాశిలో బుధ రాహువు గ్రహలు సంచరించబోతున్నారు. అయితే వీరి సంచారం కారణంగా బుధాదిపత్య యోగం ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Budhadithya Yoga : మిధునం
మిధున రాశిలో పంచల కాలంలో రాజ్యాధిపతి బుద్ధుడితో రవి కలిసినందువలన ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మిధున రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
Budhadithya Yoga కర్కాటక రాశి
కర్కాట రాశికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం కారణంగా ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అవుతుంది.
Budhadithya Yoga కన్య రాశి
కన్యా రాశికి ధన స్థానంలో రాజ్యాధిపతి బుధుడితో రవి కలయిక వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వీరికి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
తులారాశి.
తులారాశిలో బుధాదిపత్య యోగం ఏర్పడినందున ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అలాగే అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
ధనస్సు రాశి.
ధనుస్సు రాశికి లాభ స్థానంలో బుధ రాహు కలయిక వలన బుధాదిపత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా ధనుస్సు రాశి ఉద్యోగస్తులు ప్రమోషన్లను ఇంక్రిమెంట్లను పొందుతారు. వీరు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టిన అందులో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి.
మకరం.
మకర రాశికి 10వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వలన ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.