VijayaDashami : దసరా పండుగ రోజు ఈ పరిహారాలు పాటిస్తే అదృష్టం పట్టినట్టే…దేవి అనుగ్రహం లభిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

VijayaDashami : దసరా పండుగ రోజు ఈ పరిహారాలు పాటిస్తే అదృష్టం పట్టినట్టే…దేవి అనుగ్రహం లభిస్తుంది…!

VijayaDashami : దసరా పండుగ ఈ ఏడాది 12 అక్టోబర్ 2024 శనివారం రోజు జరుపుకొనున్నారు. అయితే ఈ రోజున చెడుపై మంచి గెలిచిన రోజుగా పరిగణించబడుతుంది. ఇక పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని సవరించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజున రాముడు లంకాదీసుడు రావణుడిని సంహరించి రావణుని చర నుండి సీతాదేవిని విడిపించాడు. కనుక ఈ రోజున శుభకార్యాలు వాహనాలు మరియు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని భక్తులు నమ్మకం. ఈ నేపథ్యంలోనే దసరా పండగ […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  VijayaDashami : దసరా పండుగ రోజు ఈ పరిహారాలు పాటిస్తే అదృష్టం పట్టినట్టే...దేవి అనుగ్రహం లభిస్తుంది...!

VijayaDashami : దసరా పండుగ ఈ ఏడాది 12 అక్టోబర్ 2024 శనివారం రోజు జరుపుకొనున్నారు. అయితే ఈ రోజున చెడుపై మంచి గెలిచిన రోజుగా పరిగణించబడుతుంది. ఇక పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని సవరించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజున రాముడు లంకాదీసుడు రావణుడిని సంహరించి రావణుని చర నుండి సీతాదేవిని విడిపించాడు. కనుక ఈ రోజున శుభకార్యాలు వాహనాలు మరియు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని భక్తులు నమ్మకం. ఈ నేపథ్యంలోనే దసరా పండగ రోజు కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి.

VijayaDashami దసరా రోజు చేయవలసిన నివారణలు.

దసరా పండుగ రోజు జమ్మి వృక్షానికి సంబంధించిన పరిహారాలు చేయడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే ఆ రోజు రాత్రి జిమ్మి చెట్టు లేదా మొక్క కింద దీపాన్ని వెలిగించండి. దీనివల్ల వ్యక్తి జీవితంలో న్యాయపరమైనటువంటి విషయాలలో విజయం సాధిస్తారు. అలాగే అదృష్టం లభిస్తుందని నమ్మకం.

పేదరికాన్ని తొలగించే మార్గాలు.

దసరా రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ రోజున చీపురుని దానంగా ఇవ్వడం మంచిది. మీ ఇంటి సమీపంలో ఉన్న ఆలయంలో చీపురు దానంగా ఇవ్వండి. దీని ద్వారా మనిషి ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు శత్రువుల నుంచి విముక్తిి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

కెరియర్ లో పురోగతికి మార్గాలు.

వృత్తి వ్యాపారాలలో పురోగతి లభించడం కోసం దసరా పండుగ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజు సుందరకాండను పట్టించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని ద్వారా జీవితంలో వచ్చే చెడుని నివారిస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి పురోగతిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

సంపద శ్రేయస్సు కోసం చిట్కాలు.

VijayaDashami దసరా పండుగ రోజు ఈ పరిహారాలు పాటిస్తే అదృష్టం పట్టినట్టేదేవి అనుగ్రహం లభిస్తుంది

VijayaDashami : దసరా పండుగ రోజు ఈ పరిహారాలు పాటిస్తే అదృష్టం పట్టినట్టే…దేవి అనుగ్రహం లభిస్తుంది…!

విజయదశమి రోజున పాలపిట్ట దర్శనం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఈ పక్షిని చూస్తే ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని అలాగే జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం.

విజయం సాధించడానికి మార్గాలు.

ఎంత కష్టపడినా విజయం దక్కకపోతే దసరా పండుగ రోజు పీచుతో ఉన్నన్న కొబ్బరి కాయని పసుపు గుడ్డలో చుట్టండి. పవిత్రమైన దారం మరియు స్వీట్ల తో పాటు రామాలయంలో ఉంచండి. దీని ద్వారా ప్రగతి దారులు తెలుసుకుంటాయని నమ్ముతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది