Vijayadashami : విజయదశమి నుంచి ఈ రాశుల వారికి సిరుల వర్షం… అమ్మవారి కటాక్షం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayadashami : విజయదశమి నుంచి ఈ రాశుల వారికి సిరుల వర్షం… అమ్మవారి కటాక్షం…!

 Authored By ramu | The Telugu News | Updated on :13 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Vijayadashami : విజయదశమి నుంచి ఈ రాశుల వారికి సిరుల వర్షం... అమ్మవారి కటాక్షం...!

Vijayadashami : దసరా పండుగ ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని సవహరించి రావణుడి చెర నుండి సీతను విడిపించాడు. చెడుపై మంచి విజయాన్ని సాధించడం జరిగింది కాబట్టి ఈరోజున దసరా పండుగలు జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను శ్రీరాముడికి మరియు దుర్గాదేవికి అంకితం చేయబడింది. అయితే జ్యోతిష ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు ఎంతో శుభప్రదమైనది. ఇక ఎవరి జాతకంలో అయినా గ్రహాలు శుభ స్థానంలో ఉంటే వారికి విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా విజయదశమి రోజే శ్రావణ నక్షత్రం రావడంతో ఈ రోజు ఎంతో పవిత్రమైనది. ఈ నేపథ్యంలోనే విజయదశమి సందర్భంగా ఏ రాశిలో వారికి ఏ విధంగా ఉండబోతుంది..? అలాగే వీరికి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Vijayadashami : మకర రాశి

విజయదశమి సందర్భంగా మకర రాశి వారికి కెరియర్ లో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. అలాగే కెరియర్ కు సంబంధించిన విషయాల్లో ఒక స్పష్టత ఉంటుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. ఈ సమయంలో మకర రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు.

వృషభ రాశి : విజయదశమి సందర్భంగా వృషభ రాశి జాతకులలో వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి లాభాలు ఉంటాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. వివిధ కార్యక్రమాలలో కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలిగి ఆర్థికంగా స్థిరపడతారు. అలాగే వీరు ఈ సమయంలో మానసిక ప్రశాంతతను పొందుతారు. అలాగే ఆకస్మిత ధన లాభం ఉంటుంది. ఇక మొత్తం మీద వృషభ రాశి వారికి విజయదశమి సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Vijayadashami తులారాశి

Vijayadashami విజయదశమి నుంచి ఈ రాశుల వారికి సిరుల వర్షం అమ్మవారి కటాక్షం

Vijayadashami : విజయదశమి నుంచి ఈ రాశుల వారికి సిరుల వర్షం… అమ్మవారి కటాక్షం…!

విజయదశమి సందర్భంగా తులా రాశి జాతకులకు జీవితంలో కష్టాలు అన్ని తీరిపోతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది. అలాగే దాంపత్య జీవితంలో తులా రాశి వారు సంతోషంగా గడుపుతారు. అయితే తుల రాశి జాతకులలో ఒంటరిగా జీవితం గడుపుతున్న వారికి వివాహ ప్రతివాదనలు రావడంతో పాటు వివాహాలు కూడా జరుగుతాయి. తుల రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు కష్టపడి పనిచేసి అనేక లాభాలను అందుకుంటారు. మొత్తం మీద తులా రాశి వారికి విజయదశమి సందర్భంగా అద్భుతమైన అదృష్టాన్ని పొందబోతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది