Vijayadashami : ఈరోజే విజయదశమి అత్యంత పవిత్రమైన రోజు. స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayadashami : ఈరోజే విజయదశమి అత్యంత పవిత్రమైన రోజు. స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :24 October 2023,7:00 am

Vijayadashami :  విజయదశమి రోజున దసరా పండుగ రోజు కచ్చితంగా స్నానం చేస్తే మీ దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా విజయదశమి ఇంకా దాని వెనుక ఉన్నటువంటి విశిష్టత కూడా ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. పురాణాలలో విజయదశమికి విశిష్టత అయినటువంటి స్థానం ఉంది. అంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం కచ్చితంగా ఈ ఒక్కటి వేసుకొని చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోష తొలగిపోతుంది. జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి కచ్చితంగా అపర కుబేరులు అవుతారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం తో పాటు అమ్మవారి కరుణాకటాక్షాలు కూడా మీపై ఎప్పుడు ఉంటాయి. మన హిందూ ధర్మంలో జరుపుకునే నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి దశమినాడు అపరాశతాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు.

విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. అలాగే శమీ వృక్షాన్ని దర్శించుకుని దసరా వేడుకలు ఉత్సాహంగా చేసుకుంటారు. ఆ తరువాత పాలపిట్టను దర్శించుకోవడం కూడా మన హైందవ ధర్మం ఆనవాయితీ నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రత్యేకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కధలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దసరా పండుగ రోజున మీరు ఉదయం సాయంత్రం వేళల్లో స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్క వస్తువును వేసుకొని స్నానం చేస్తే మీ జన్మజన్మల పాపాలు ఇంకా వేధిస్తున్నటువంటి దరిద్రంతో పాటు సకల పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆపరకు కుబేరులు అవుతారు. జీవితంలో ఉన్నత స్థితికి సాధించుకుంటారు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోడానికి కూడా ఈ అవకాశం మీకు విజయవంతంగా సంకల్ప సిద్ధి లభిస్తుంది. అంతేకాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో స్నానం చేసే రోజున అంటే ముఖ్యంగా ఈ దసరా రోజున మాత్రమే ఉదయం సాయంత్రం చేసే స్నానం నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేస్తే గనుక చాలా మంచిది.

Today is the most auspicious day of Vijayadashami just put this one in the bath water

Today is the most auspicious day of Vijayadashami, just put this one in the bath water

ఈ వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక మీకు ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు ఇంకా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కూడా ఎప్పుడు మీ మీద ఉంటాయి. మీరు వేప చెట్టును ఎంతో లక్ష్మీదేవిగా అమ్మవారి రూపంగా మనం భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ వేప చెట్టులో మనకు ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి.

దాంతోపాటు వేప చెట్టుకు విశిష్టత మైనటువంటి ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. కనుక ఇలాంటి దసరా పండుగ రోజున వేప చెట్టుకు ఉన్నటువంటి ఆకుల్ని తీసుకోని వచ్చి స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాంతోపాటు మీకు ఎప్పటినుంచో వేధిస్తున్నటువంటి అనారోగ్యాలు కూడా తొలిగిపోయి మీరు జీవితంలో వృద్ధి చెందుతారు. ఇక ఆర్థిక పరంగా దాంపత్య పరంగా సంతానపరంగా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది