Eating Meals : నిల్చొని తినకూడదా? మంచంపై కూర్చుని తింటే ఏం కాదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eating Meals : నిల్చొని తినకూడదా? మంచంపై కూర్చుని తింటే ఏం కాదా?

 Authored By pavan | The Telugu News | Updated on :26 May 2022,6:00 am

Eating Meals : మనం చేసే ప్రతి పనిలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పద్ధతులు అని కూడా అంటారు. ముఖ్యంగా సాంప్రదాయమైన పనులు చేసే సమయంలో పద్ధతి అనే ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పనులు చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు. ఆయా విషయాల్లో మన పెద్ద వారు ఎప్పుడూ మనల్ని గాడిలో పెడతారు. ప్రస్తుతం కాలంలో పెద్దల మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వారు చెప్పేదాని గురించి కొద్దిగా కూడా ఆలోచించకుండా ఛాదస్తం అంటూ కొట్టి పడేస్తున్నారు. ఇంట్లో నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పే ప్రతి విషయంలోనూ ఆరోగ్య స్పృహ లేదా సాంప్రదాయ స్పృహ ఉంటుంది.

భోజనం చేసే విధానాన్ని పెద్దలు మరీ మరీ చెబుతుంటారు. హడావిడి పడుతూ తింటే ప్రశాంతంగా కూర్చుని తినూ అంటూ అనడం చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఉరుకులు పరుగులు పెడుతూ నాలుగు ముద్దలు పొట్టలో వేసే వారికి ఈ మాటలు ఇంకా ఎక్కువగా గుర్తుంటాయి. కాళ్లు, చేతులూ కడుక్కుని వచ్చి భోజనాని కూర్చోవాలని చెబుతుంటారు. సుఖాసనంలో కూర్చుని ప్రశాంతంగా భోజనం చేయాలని పెద్దలు చెప్పే మాట.తిన్న తిండి ఒంటికి పట్టాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్న ఒక పద్ధతిలో భోజనం చేయాలి. వంటలు వండే వారు కచ్చితంగా స్నానం చేసి తీరాలి. దంతాలను శుభ్రం చేసుకోకుండా భోజనం వండకూడదు. అలాగే వంటలు వండే సమయంలో కాళ్లకు చెప్పులు ధరించరాదు.

eating meals our ancestors rules

eating meals our ancestors rules

భోజనం చేసే ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తిన్న తర్వాత కూడా ఇలాగే చేయాలి. అన్నం తినే సమయంలో చేతులకు తడి ఉండకుండా వస్త్రంలో తుడుచుకోవాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చుని భోజనం చేయాలి. భోజనం వడ్డించుకునే సమయంలో లేదా ఇతరులకు వడ్డించే సమయంలో పదార్థాలను కంచానికి తగలకుండా వడ్డించాలి. కంచానికి తగిలేలా వడ్డించడం వల్ల అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలను ఎవరికి వడ్డించినా అది దోషమే.చొట్టలు పడిన కంచంలో భోజనం చేయకూడదు. అరటి ఆకులు లేదా విస్తారాకుల్లో భోజనం తినడం మంచిది. అలాగే నిలబడి తినకూడదని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఇతరులతో కలిసి భోజనం తినే సమయంలో మధ్యలో నుంచి లేవకూడదు. అందరూ తినే వరకు వేచి చూడాలి. మాడి పోయిన అన్నాన్ని అతిథులకు ఎట్టి పరిస్థితుల్లో వడ్డించకూడదు.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది