Famous Temples : కోరిన కోరికలన్నీ తీర్చే గలిగే 7 ప్రసిద్ధ ఆలయాలు మనదేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Famous Temples : కోరిన కోరికలన్నీ తీర్చే గలిగే 7 ప్రసిద్ధ ఆలయాలు మనదేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా….?

 Authored By ramu | The Telugu News | Updated on :9 December 2024,6:00 am

Famous Temples : మన భారతదేశంలో గల్లీకో టెంపుల్ ఉన్నాయి. అలాగే కొన్ని వేల సంవత్సరాల నుండి అనేక పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో కొన్ని టెంపుల్స్ చాలా పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్నాయి. మన దేశంలో దేవాలయాలు దేశపు లోతైన ఆధ్యాత్మిక, సామాజిక,సాంస్కృతిక వారసత్వానికి శక్తివంతమైన ప్రతిరూపాలుగా నిలుస్తాయి. ఇటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాలకు వెళ్లి మన మనసులోని కోరికలను కోరుకుంటే తప్పక నెరవేరుతుంది. భక్తులు తమ కోరికలు తీరుస్తాయని నమ్మే ఏడు పురాతన దేవాలయాల లిస్ట్ ని ఇక్కడ చూడండి. ఈ తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల ఆలయంలో భారతదేశంలోనే అత్యంత ఆరాధ్య దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచిన ఒకటైన ఆలయం. లక్షలాదిమంది కోట్లాదిమంది భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుంటారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని ఆలయమును దర్శించుటవలన శ్రేయస్సు. సంతోషం,అదృష్టానికి సంబంధించిన కోరికలను నెరవేర్చుతుందని భక్తులు బలంగా నమ్ముతారు.దేశవ్యాప్తంగా అనేక నగరాల నుంచి దేశాల నుంచి తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుపతి కొండమీద ప్రకృతి అందాల మధ్య శ్రీ వెంకటేశ్వరుడు ఏడుకొండల పైన కొలువుదీరిన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందింది.

Famous Temples కోరిన కోరికలన్నీ తీర్చే గలిగే 7 ప్రసిద్ధ ఆలయాలు మనదేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా

Famous Temples : కోరిన కోరికలన్నీ తీర్చే గలిగే 7 ప్రసిద్ధ ఆలయాలు మనదేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా….?

Famous Temples సిద్ధి వినాయక ఆలయం

ఈ సిద్ధి వినాయక ఆలయం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ఆలయం వినాయకుడికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి శ్రేయస్సు,ఆనందం, విజయానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని భక్తుల యొక్క నమ్మకం. భక్తులు స్వామివారికి పూజలు, పూలు, మొదలగు సమర్పించి ఆశీస్సులు పొందుతారు. ఆలయపు అద్భుతమైన వాస్తు శిల్పం దీనిని ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా చేస్తుంది. ఈ ఆలయంలో మంగళవారం జరిగే హారతిలో భక్తులు ఎక్కువగా పాల్గొంటారు. ఉదయం 3 Bags 15 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు మొత్తం ఆరు రకాల హారతులు నిర్వహిస్తారు.

Famous Temples కామాఖ్య దేవి ఆలయం

అస్సాం రాష్ట్రంలో గౌహతి సిటీ శివారాలలో నీలాచల కొండపై ఉన్న కామాఖ్య ఆలయం 18 శక్తి పీఠాలలో ఒకటైన పీఠం. ఈ శక్తి పీఠం. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అమ్మవారి యోగి భాగం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి బదులు యోని భాగం పూజలు అందుకుంటుంది. ఈ ఆలయం సంతానోత్పత్తి. శ్రేయస్. ఆనందానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందనినమ్ముతారు. ఈ అమ్మవారికి పూజలు పూలు జంతువులని బలి సమర్పించి ఆశీస్సులను అందుకుంటారు. ఈ ఆలయంలో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం.

Famous Temples కేదార్నాథ్ ఆలయం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో అక్కడ కొలువుతీరిన కేదార్నాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి ఆధ్యాత్మిక, మోక్షానికి సంబంధించిన కోరిన కోరికలను నెరవేరుస్తుందని బలంగా నమ్ముతారు. సుందరమైన హిమాలయాల గుండా ట్రేకింగ్ చేస్తూ ఈ ఆలయానికి వెళ్లి స్వామివారి పూజలు, పండ్లు ఫలహారాలు, పూలు తీసుకొని వెళ్లి దేవునికి సమర్పిస్తారు. ఆలయం యొక్క ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండి , అద్భుతమైన ప్రదేశం గా చెప్పబడుతుంది. తడి దేవస్థానమును తప్పక భక్తులు దర్శించవలసిన పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు.

Famous Temples వైష్ణో దేవి ఆలయం

ఈ పుణ్యక్షేత్రం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ సిటీకి కొద్ది దూరంలో కూట పర్వతాలపై నా వైష్ణో దేవి ఆలయం పరిగణింపబడినది. ఆలయం వైష్ణో దేవికి అంకితం చేయబడింది. ప్రతినిత్యం లక్షలాదిమంది భక్తులు కోట్లాదిమంది ఈ ఆలయానికి వచ్చి భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించుటవలన ఆరోగ్యం సంపద,సంతోషం, సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Famous Temples కాళీమాత ఆలయం

పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా కాళీఘాట్ ఖాళీ ఆలయం కాళీమాతకు అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయమునకు రక్షణ, బలం, జ్ఞానానికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తులు కాళికామాతకు పూలు పండ్లు సమర్పించి ఆశీస్సులను అందుకుంటారు. ఆలయపు ఆహ్లాదకరమైన వాతావరణమును కలిగి ఉంటుంది. అద్భుతమైన వాస్తు శిల్పం దీనిని ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా చేస్తుంది.

మంగేష్ ఆలయం : గోవాలోని మంగేష్ ఆలయం శివునికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది. ఆలయం శ్రేయస్సు, సంతోషం అదృష్టానికి సంబంధించిన కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు. తులు స్వామివారికి పూజలు, పూలు కొబ్బరి నీళ్లు సమర్పించి ఆశీస్సులను పొందుతారు

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది