Solar Eclipse : నూతన సంవత్సరం 2025 లో మొదటి సూర్యగ్రహణం… ఈ నాలుగు రాశులు నక్క తోక తొక్కినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Solar Eclipse : నూతన సంవత్సరం 2025 లో మొదటి సూర్యగ్రహణం… ఈ నాలుగు రాశులు నక్క తోక తొక్కినట్లే…!

 Authored By ramu | The Telugu News | Updated on :21 December 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Solar Eclipse : నూతన సంవత్సరం 2025 లో మొదటి సూర్యగ్రహణం... ఈ నాలుగు రాశులు నక్క తోక తొక్కినట్లే...!

Solar Eclipse : కొత్త సంవత్సరము ప్రారంభంలో మొదటి సూర్యగ్రహణం రోజున అనేక శుభ పరిణామాలు జరగబోతున్నాయి. అరుదైన ఖగోళ దృశ్యాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం కలగబోతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు ఏర్పడి సాయంత్రం ఆరు గంటల 13 నిమిషాల వరకు కొనసాగుతుంది. పాక్షిక సూర్య గ్రహణంగా ఉంటుంది.

Solar Eclipse 2025 సంవత్సరంలో సూర్యగ్రహణం

ఈ సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు సెప్టెంబర్ మాసంలో 21వ తేదీన ఏర్పడుతుంది. కూడా పాక్షిక సూర్యగ్రహణం గానే ఉంటుంది. 2025 మార్చి 29వ తేదీన శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేస్తున్నాడు. శనీశ్వరుడు రాత్రి 11 గంటలకు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహాల యొక్క సంచారంలో మార్పులు, సూర్యగ్రహణం ప్రభావంతో కొన్ని రాశుల వారు అదృష్ట రాశులుగా మారుతున్నారు.

Solar Eclipse నూతన సంవత్సరం 2025 లో మొదటి సూర్యగ్రహణం ఈ నాలుగు రాశులు నక్క తోక తొక్కినట్లే

Solar Eclipse : నూతన సంవత్సరం 2025 లో మొదటి సూర్యగ్రహణం… ఈ నాలుగు రాశులు నక్క తోక తొక్కినట్లే…!

మిధున రాశి : ఈ 2025 వ సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. ఈ రాశి వారు ఏ పని చేసినా సరే అన్నిట్లా విజయాలు సాధిస్తారు. ఆగిపోయిన పనిలోకి మళ్ళీ శ్రీకారం చుడతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. గృహ యోగం కలుగుతుంది. ఈ సమయము మిధున రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం.

ధనస్సు రాశి : ఈ ధనస్సు రాశి వారికి కూడా మొదటి సూర్యగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరంలో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. నూతన పనులు ప్రారంభించుటకు ధనస్సు రాశి వారికి మంచి సమయం. అలాగే వర్తక వ్యాపారులు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది
. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయాలు తెచ్చి పెట్టే కాలం.

తులారాశి : మొదటి సూర్యగ్రహణంతో పాటు శని సంచారం కారణంగా తులా రాశి జాతకులకు ఈ సమయంలో సానుకూలఫలితాలను పొందుతారు. ఆర్థికంగా పురోగతిని కూడా తులా రాశి వారు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు తులా రాశి వారికి మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. తులా రాశి వారికి ఇది కలిసి వచ్చే కాలం.

మీన రాశి : మీన రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్తగా పనులు చేపట్టాలని అనుకునే వారికి ఇది సరైన సమయం. వర్తక వ్యాపారులు చేసే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం మరియు లాభదాయకంగా ఉంటుంది. ఏ పని చేపట్టిన అన్నిటిలో విజయాలు సాధిస్తారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది