
For Bojja Ganapayya, make four prasads in a pinch with the same batter...
Bojja Ganapayya : వినాయక చవితికి బొజ్జ గణపయ్య ఎన్నో రకాలుగా ప్రసాదం చేసి పెడుతూ ఉంటారు. వాటిలలో ఉండ్రాలను ముఖ్యంగా పెడుతూ ఉంటారు. అయితే ఆ ఉండ్రాలని చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా… దీనికి కావాల్సిన పదార్థాలు : బియ్యప్పిండి, పచ్చి కొబ్బరి, బెల్లం, పంచదార, జీడిపప్పులు, వెండి కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, కిస్ మిస్లు, నెయ్యి మొదలైనవి..
నాలుగు ప్రసాదాలు తయారీ విధానం : ముందుగా రెండు కప్పుల బియ్యప్పిండిని తీసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు కప్పుల వాటర్ ని పోసుకొని చిటికెడు ఉప్పు కొంచెం పంచదార వేసి నీటిని మసలు పెట్టి దానిలో ఈ పిండిని వేసుకోవాలి. తర్వాత బాగా కలిపి తర్వాత స్టవ్ ఆపి దాన్ని చల్లారనివ్వాలి. తర్వాత స్టౌ పై ఇంకొక కడాయిని పెట్టుకుని దానిలో ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. అది దగ్గరకు అవుతుండగా.. కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత దానిని దింపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ని వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
For Bojja Ganapayya, make four prasads in a pinch with the same batter…
తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పిండిని చల్లారిన తర్వాత ఆ పిండిని బాగా స్మూత్ గా అయ్యేలాగా కలుపుకొని తర్వాత దానిని నాలుగు రకాలుగా ఉండలుగా చేసుకోవాలి. ఒకటి పెద్ద సైజు, రెండోది కొంచెం చిన్న సైజు, మూడోది దానికంటే చిన్న సైజు, నాలుగోది ఇంకా చిన్న సైజు, ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా పెద్ద సైజు ఉండలని తీసుకొని, దీనిని రౌండ్ గా అరిసెలు మాదిరిలో ఒత్తుకొని దానిలో ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని దీనిలో పెట్టి గజ్జి కాయ లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా కొన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండవ పదార్థం: రెండవ సైజు ఉండలని తీసుకొని దానిని కూడా అదే సైజులో అరిస మాదిరిగా ఒత్తుకొని దానిలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకొని దానిని చుట్టూ పైకి ఒక ఒత్తి లాగా వచ్చేలా.. చేసుకొని చుట్టూ చాక్ తో గాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా కొన్నిటిని చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
3వ ఐటెం. మూడో సైజు ఉండ్రాళ్లను తీసుకుని దానిని కూడా అప్ప లాగా చేసి దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టుకొని దానిని ఉండ్రాయిలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా కొన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి అని పెట్టుకుని. దానిలో ఒక కప్పుతో నీళ్లు పోసుకుని దానిలో కొంచెం బియ్యం నూకను వేసుకొని దానిలో ఉండ్రాలను వేసి ఆ నీళ్లంతా ఇనకే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దానిలో రెండు కప్పుల పాలను వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత దానిలో ఒక కప్పు బెల్లం వేసుకుని సన్నని మంటపై ఐదు నిమిషాల వరకు ఉడకనిచ్చి దాన్లో యాలకుల పొడి చల్లుకొని తర్వాత స్టవ్ ఆపి దింపి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే, తర్వాత ముందుగా కొబ్బరి మిశ్రమంతో నింపి పెట్టుకుని ఉండ్రాలని కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఉడికించుకోవాలి. అంతే ఒకే పిండితో నాలుగు రకాల ప్రసాదాలు రెడీ.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.