Gajkesari Yogam : ఈ గ్రహాల కలయికచే…నేటి నుంచి గజకేసరి యోగం… ఈ 3 రాశుల వారుకి దేవుడు అవి ప‌క్కాఇస్తాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gajkesari Yogam : ఈ గ్రహాల కలయికచే…నేటి నుంచి గజకేసరి యోగం… ఈ 3 రాశుల వారుకి దేవుడు అవి ప‌క్కాఇస్తాడు

 Authored By ramu | The Telugu News | Updated on :5 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Gajkesari Yogam : ఈ గ్రహాల కలయికచే...నేటి నుంచి గజకేసరి యోగం... ఈ 3 రాశుల వారు వీటిని కొనుగోలు చేస్తారు...?

Gajkesari Yogam జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మనందరికీ తెలుసు. అయితే గ్రహాలలో చంద్రుడు తన రాశిని అత్యంత వేగంగా తన స్థానాన్ని మార్చుకోగలుగుతాడని చెప్పబడినది. మరి చంద్రుడు త్వరలోనే బృహస్పతి తో కలవబోతున్నాడు. చంద్రుడు, దేవ గురువు అయిన బృహస్పతి తో కలయిక జరగటం వలన శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ మూడు రాశుల వారికి ప్రతి రంగంలో కూడా ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు లభించబోతున్నాయి. గ్రహాలలో ముఖ్యమైన గ్రహం దేవ గురు అయిన బృహస్పతి గ్రహం. ప్రస్తుతం వృషభ రాశి లో ఈ బృహస్పతి అయిన దేవ గురువు సంచరిస్తున్నాడు. ఈ గురువు మే వరకు కూడా బృహస్పతి సంచారం వృషభ రాశి లోనే ఉంటుంది. ఈ సమయంలోనే గురువు ఏదో ఒక గ్రహంతో కలిసి ఉంటాడు. అప్పుడే శుభము లేదా అశుభ యోగాలను సృష్టిస్తాడు గురువు. ఇక్కడ చంద్రునితో బృహస్పతి అయిన గురువు కలయిక చేత ప్రత్యేకమైన శుభ ఫలితాలను కలుగజేయబోతున్నాడు అనే పండితులు తెలియజేస్తున్నారు…

Gajkesari Yogam ఈ గ్రహాల కలయికచేనేటి నుంచి గజకేసరి యోగం ఈ 3 రాశుల వారుకి దేవుడు అవి ప‌క్కాఇస్తాడు

Gajkesari Yogam : ఈ గ్రహాల కలయికచే…నేటి నుంచి గజకేసరి యోగం… ఈ 3 రాశుల వారుకి దేవుడు అవి ప‌క్కాఇస్తాడు

పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలియజేసేది ఏమనగా.. ఈనెల మార్చి 5న, ఉదయం 8:12 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోనికి ప్రవేశించబోతున్నాడు. అప్పటికే దేవగురువు బృహస్పతి వృషభరాశిలోనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లోని చంద్రుడు, బృహస్పతి తో కలుస్తాడు. రెండు గ్రహాల కలయికే శక్తివంతమైన గజకే శ్రేయోగాన్ని ఏర్పరుస్తుంది. యోగం ఎంతో శక్తివంతమైనదే కాదు ప్రయోజనకరమైనది కూడా అని పరిగణింపబడింది. కేసరి యోగం మూడు రాశుల వారికి మాత్రమే ఎన్నో ప్రయోజనాలను అందించబోతుంది. ఆ మూడు అదృష్టవంతమైన గజకేసరి యోగాన్ని పొందగలిగే రాశులు ఏమిటో తెలుసుకుందాం…..

Gajkesari Yogam   వృశ్చిక రాశి

ఈ వృశ్చిక రాశి వారికి జ కేసరి యోగం ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారు ఏడవ ఇంట్లో గురువు, చంద్రుడు సంయోగం చెందుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజయోగం ప్రభావం కారణంగా వృశ్చిక రాశి వారికి ప్రతి రంగంలో కూడా విజయాలను అందుకుంటారు. జీవితంలో వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వరాలు చేసే వారికి లాభాలను చూస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవితం సుఖశాంతులతో ఆనందంగా ఉంటుంది.

కుంభరాశి : ఈ కుంభరాశి వారికి గజకేసరి యోగం ఏర్పడడం వలన శుభప్రదంగా ఉంటుంది. వీరికి అనేక ప్రయోజనాలను అందుకుంటారు. కుంభరాశిలో నాలుగవ ఇంట్లో గురువు, చంద్రుడు సంయోగం చెందబోతున్నాడు. ఈ గజకేసరి యోగం చేత కుంభరాశి వారికి జీవితంలో సుఖసంతోషాలు విరాజుల్లుతాయి. సమంత మేన జీవితాన్ని గడపగలుగుతారు. మీరు చేసే వృత్తి పట్ల ప్రత్యేక శ్రద్ధను పాటిస్తే, తప్పకుండా విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగాలలో పని చేసే చోట విజయం వీరిదే. కుంభ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తులను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇష్టమైన వారితో సమయాన్ని కేటాయించుతారు.

మీన రాశి : మీన రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. నీ రాశి వారికి మూడవ ఇంట్లో గురుడు, చంద్రుడు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. గజకేసరి రాజయోగం చేత మీన రాశి వారు గౌరవ మర్యాదలను పొందుతారు. వారి జీవితంలో పురోగతిని చూస్తారు. వ్యాపారాలు చేసే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. విజయం వీరి వెంటే ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది