Ganesh Idol : ఈ భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే… మీకు అన్ని శుభాలే కలుగుతాయి…
Ganesh Idol : హిందువులు వినాయకుడి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. వినాయకుడి పూజ కి హిందూమతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ కార్యం తలపెట్టిన ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఆ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఎందుకంటే మనం చేసే కార్యంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని వినాయకుడిని ఆరాధిస్తాము. ప్రతి సంవత్సరం వినాయక చవితి భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి తిథినాడు వస్తుంది. పది రోజుల దాకా ఆ పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజున గణేశుడి విగ్రహ ప్రతిమను రకరకాల భంగిమల్లో ఏర్పాటు చేస్తున్నారు గణేశుడు విగ్రహాలను ఏ భంగిమ ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. నృత్య భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహం ను ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. గణపతి విగ్రహాన్ని పూజించడం ద్వారా కళా రంగంలో కోరుకున్న పురోగతి, కీర్తి లభిస్తుందని నమ్మకం.
అలాగే ఆశీర్వాద భంగిమలో కూర్చున్న గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోయి, కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అని నమ్మకం. ఎలుకపై నిలబడి ఉన్న గణపతి విగ్రహాన్ని పూజించిన వ్యక్తి తన జీవితంలో అతిపెద్ద బాధ్యతను సులభంగా స్వీకరించగలడని నమ్ముతారు. వాస్తు ప్రకారం గణపతి ఎలుకపై నిలబడి ధైర్యం శక్తికి చిహ్నంగా భావిస్తారు. వినాయకుడిని పడుకోబెట్టి లేదా నిచ్చలమైన భంగిమలు పూజించడం ద్వారా అన్ని రకాల సంతోషాలను పొందుతారు. శయన గణపతి విగ్రహాన్ని పూజించడం ద్వారా ఇంట్లో సుఖసంతోషాలు విరజిల్లుతాయని నమ్మకం. రసాయనాలతో చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేయకూడదు. ఇంట్లో మట్టి గణపతిని తీసుకువచ్చిన తర్వాతే పూజలు చేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో కుటుంబీకులు ఆరోగ్యంగా ఆయుష్మంతులై ఉంటారు.
కుడి వైపు తొండం తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహానికి బదులుగా ఎడమవైపు తొండం ఉన్న విగ్రహాన్ని పూజించాలని నమ్మకం. కుడివైపుకు తిప్పిన గణపతిని మొండి గా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇలాంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. అయితే ఆలయంలోపల ప్రతిష్టించిన అటువంటి విగ్రహాన్ని పూజించడం వలన అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. మట్టి గణపతి దొరకని సమయంలో వేప చెక్కతో చేసిన విగ్రహం లేదా స్పటికంతో చేసిన విగ్రహాన్ని పూజించవచ్చు. అవి ఏమి దొరకకపోతే తమలపాకు మీద పసుపుతో చేసిన గణపతిని పూజించవచ్చు. గణపతి విగ్రహాన్ని తీసుకునేటప్పుడు అతని చేతిలో పాము, అంకుశం రెండు ఉండేలా చూసుకోవాలి. అలాగే అతని వాహనం ఎలుక కూడా ఉండాలి. విగ్రహాన్ని ఇంటి ఈశాన్యం మూలలో ఉంచాలి. పూజ చేసేటప్పుడు గణేశుడు వీపు కనిపించకుండా జాగ్రత్త వహించాలి.