God Worship : దేవుళ్ళని ఆరాధించేటప్పుడు ఈ 5 పొరపాట్లు చేస్తే మీ కోరికలు తీరవు… అవేమిటో తెలుసుకోండి…
God Worship : భారతీయ సంస్కృతిలో దేవుళ్లకు పూజలు చేసేటప్పుడు కొన్ని నియమా నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడి యొక్క అనుగ్రహం కలగడం, భగవంతుడి కృప, ఆశీర్వాదాలు పొందడం చాలా ప్రధానం, అది లభిస్తే ఇక ఎప్పుడు జీవితంలో శుభాలే జరుగుతాయని నమ్మకం. అయితే పూజా కార్యక్రమాలు లో పొరపాట్లు చేసేవారుకి సంవత్సరాల తరబడి ఆరాధన చేసిన ఎటువంటి ఫలితాలు లభించవు అని వేద పండితులు తెలియజేస్తున్నారు. ఆరాధనకి సంబంధించిన నియమనిష్టలు విస్మరించడం వలన వారి కలలు ఏనాటికి తీరవు. పొరపాటుగా పూజలు నిర్వహిస్తే చెడు ఫలితాలను పొందవలసి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
*దేవుడిని ఆరాధించేటప్పుడు వాడిపోయిన, లేదా కుళ్ళిపోయిన పువ్వులను వాడకూడదు. ఎల్లప్పుడు తాజా పువ్వులని దేవుడికి సమర్పించాలి. అదేవిధంగా పూజలో నిషిద్ధమని భావించే పువ్వులను ఏనాడు వాడకూడదు. *దేవుణ్ణి పూజించేటప్పుడు ఏనాడు గర్వం చూపించవద్దు. ఈ విధంగా చేస్తే పూజలు చేసిన ప్రతిఫలం దక్కదు. దేవుని పూజ ఎప్పుడు ప్రశాంతంగా, ఏకాంతంగా మైన మనసుతో నిర్వహించాలి. *దేవుడి ఆరాధనలో ప్రధానమైన నియమం ఏమిటంటే భగవంతుని ఎప్పుడు స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతంగా ఆరాధించాలి. దేవుడిని ఆరాధించేటప్పుడు మనసు మిగతా విషయాలపై పెట్టవద్దు. ఎవరిపైనా ఆగ్రహం చేయవద్దు. దేవుడిని ఆరాధించటం వలన మనసులో తప్పుడు ఆలోచనలు వస్తే దానికి ఫలితం దక్కదు అని నమ్మకం గట్టిగా ఉంది.
*మత గ్రంధాల ప్రకారం ఏ భగవంతుడు నైనా ఆరాధించేటప్పుడు నీటి కుండను, దీపమును పక్కన ఉంచకూడదు. పూజకు వినియోగించి కలశాన్ని నీటి పాత్రను ఎప్పుడు ఈశాన్య దిశలోనే పెట్టాలి. దేవుళ్లకు దీపం ఎప్పుడు ఆగ్నేయ దిశలోనే పెట్టాలి. *హిందూమతంలో ఏ దేవుళ్ళ ఆరాధనలోనైనా ఆసనాలకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. దేవుడి పూజలో ఒక నిర్దిష్ట దేవత లేదా నవగ్రహానికి సంబంధించిన కలర్లు, ఆసనాన్ని ఎప్పుడు వినియోగించాలి. కష్టం లేకుండా నేలపైనే కూర్చొని పూజలు నిర్వహించే వారికి ఫలితం అందదని నమ్మకం.