Tirumala Tirupati Devasthanam : గుడ్ న్యూస్ చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం…వివాహం చేసుకోవాలనుకుంటున్నవారికి మంచి అవకాశం…
Tirumala Tirupati Devasthanam : తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని 2007 ఫిబ్రవరి 22వ తేదిన ప్రారంభించారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కరోనా కారణం చేత రెండు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. అయితే,కరోనా తగ్గుముఖం పెట్టడం వలన కళ్యాణమస్తు కార్యక్రమాన్నిపున: ప్రారంభిస్తున్నాం అని టిటిడి వారు చెప్పారు. టిటిడీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణమస్తు ప్రారంభించాలని ముహుర్తం ఖరారు చేసారు.దానికి సంబంధించిన వివరాలు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారావు తెలిపారు.
good news Tirumala Tirupati Devasthanam announced marriages opportunities
పెళ్లి చేసుకోవాలనుకునే వారు ముందుగా టిటిడీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అర్హులైన పేదవారు వారీ జిల్లా కలెక్టరేట్,ఆర్టీవో ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.హస్తా నక్షత్ర యుక్త,సింహలగ్న పుష్కారాంశమున ఉదయం 8గంటల నుంచి 8:17 నిమిషాల మధ్య సాముహిక వివాహాలు జరిపిస్తామని టిటిడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు తెలిపారు.