Guru pournami : గురు పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తే సకల పాపాలన్నీ మాయం … తప్పక తెలుసుకోండి
ప్రధానాంశాలు:
Guru pournami : గురు పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తే సకల పాపాలన్నీ మాయం ... తప్పక తెలుసుకోండి
Guru pournami : గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి..? ఆ రోజున గురు అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చేయాలి..? గురు పౌర్ణమి రోజున గురువుని ఏ విధంగా స్మరించుకోవాలి. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం .. దత్తాత్రేయ స్వామి వారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరిని గురువుగా భావించాలి. గురువుకి ఏదైనా ఒక రోజు ఉంది అంటే ఆషాడ శుద్ధ పౌర్ణమి దీనినే గురుపౌర్ణమి అంటారు. ఇది 2024 జులై 21వ తేదీన ఆదివారం వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనం ఎంత స్మరిస్తే అంత మంచి జరుగుతుంది. ఈ రోజు గురువు యొక్క సేవ విశేషంగా చెప్పబడింది. ఇక ఈ రోజు పరమేశ్వరుడు అలాగే సాక్షాత్తు జగన్మాత మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే “గురుబ్రహ్మమ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ” గురువుకి సేవ చేసుకోవాలి.
అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞానం అనే దీపం వెలిగించేదే గురువు. వ్యాస జయంతిగా మనం దీనిని చేస్తూ ఉంటాం. ఈ రోజున వ్యాస పూజ చేయడం యతీస్వర్లు వారి యొక్క జీవితంలో దీనిని పుట్టిన రోజుగా చేసుకుంటారు. ఈ గురు పౌర్ణమి నుంచి వారు నాలుగు మాసాల వరకు చాతుర్మాస్య పర్వదీక్షను చేస్తారు. దాని ద్వారా వారు పరమాత్మకు మరింత చేరువవుతారు. కాబట్టి గురువు బట్టలు ఉతికిన, గురువు సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్న ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్న , పూజ చేసుకునేటప్పుడు ఉన్న ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. ఇది జ్ఞాన అంధకారాలను బయటకు తీస్తుంది.
అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై 21 ఆదివారము వ్యాస పూర్ణిమ. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సిన సామాగ్రిని సమర్పణ చేయండి. వ్యాస పూర్ణిమ మన కర్మలను కడిగేస్తుంది. మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఆరోజు వేద పారాయణాన్ని వినాలి. పోతులూరు వీర బ్రహ్మ స్వామి గురువే కాబట్టి ఆయనను కూడా స్మరించుకోవాలి. ఇక ఆషాడ శుక్ల పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అంటాం. గురువు యొక్క అనుగ్రహం అందరి పైన ఒకే విధంగా ఉంటుంది. అజ్ఞానాన్ని తొలగించే గొప్ప శక్తి గురువుకి మాత్రమే ఉంటుంది.కాబట్టి ఈ ఒక్క రోజు గురువును సేవించటం స్మరించటం చాలా మంచిది.