ధర్మపురి నరసింహ స్వామి ఆల‌య ర‌హ‌స్యాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ధర్మపురి నరసింహ స్వామి ఆల‌య ర‌హ‌స్యాలు..!

 Authored By keshava | The Telugu News | Updated on :12 June 2021,1:16 pm

Laxmi Narasimha Swamy నారసింహ అవతారాలకు తెలుగు రాష్ట్రాలకు అత్యంత అవినాభావ సంబంధం ఉంది. నవ నారసింహ క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. వాటిలోప్రముఖమైన నారసింహ క్షేత్రం గోదావరి తీరాన వెలిసిన క్షేత్రం ధర్మపురి. ఈ క్షేత్ర విశేషాలు చరిత్రను తెలుసుకుందాం… శివ,విష్ణు సంబంధ క్షేత్రంగా అంటే హరిహర క్షేత్రంగా పేరుగాంచిన ఈ క్షేత్రం పౌరాణిక విశేషాలను తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం..

రాక్షసుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశిపుని ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.. ఇంకేముంది. క్రూరుడైన రాక్షసునికి బ్రహ్మ అండదండలు లభించాయి. తనకు మరణం ఉండకూడని విధంగా వరం కోరాడు. బ్రహ్మ ఈ కోరికకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తనకు దేవతలతో, మానవులతో, మృగాలతో, ఆయుధాలతో, పగటి వేళ, రాత్రివేళ, ఇంట్లో, బయటా భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. గత్యంతరం లేకుండా బ్రహ్మ వరం ప్రసాదించి వెళ్ళాడు. అసలే రాక్షసుడు. పైగా బలవంతుడు. ఇప్పుడు మరణం లేకుండా వరం పొందినవాడు. దీనితో హిరణ్యకశిపుడు విజృంభించాడు. అదుపు లేక పోయాడు. ముల్లోకాలపై ఆధిపత్యం ప్రకటించాడు.. దేవతలను, మానవాళిని వేధింపసాగాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. బాల్యంలోనే భాగవతుడైనాడు. ఇది తండ్రికి నచ్చలేదు. విష్ణుభక్తిని మానుకోవాలని నచ్చచెప్పాడు, ఫలితం లేకపోగా, చివరకు ప్రహ్లాదుని చంపడానికి కూడా వెనుకాడలేదు. దేవతలు విష్ణువుకు తమ గోడు విన్నవించుకొన్నారు. హిరణ్యకశిపునకు అంతం వచ్చింది. అతనికి పగలు, రాత్రి, ఆయుధాలతో, మానవులతో, మృగాలతో మరణం లేదు కాబట్టి విష్ణువు సాయం సంధ్య వేళ, సగం మానవుడు సగం సింహం స్వరూపుడైన నరసింహావతారంతో, స్థంభం నుండి వెలువడి, గడప వరకు లాగుకొని వెళ్లి గడపపై తన ఒడిలో వేసుకొని గోళ్లతో చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుడు భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం పొందిన కారణంగా విష్ణువు అతడిని ఒడిలో వేసుకొని చంపవలసి వచ్చింది.

History of Sri Laxmi Narasimha Swamy Dharmapuri Temple

History of Sri Laxmi Narasimha Swamy Dharmapuri Temple

Laxmi Narasimha Swamy ధర్మపురిలో నారసింహ స్వామి ధ్యానం…

హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చాడు. శాంతించాలని దేవతలు స్వామిని ప్రార్థించారు. శాంతించిన నరసింహుడు ధర్మపురి చేరుకొని అక్కడ యోగముద్రతో ధ్యానం చేశాడని ఇతిహాసాలలో పేర్కొన్నాయి.
ధర్మపురి ఆలయంలో శివుడు రామలింగేశ్వరుడుగా వెలిశాడు. దీనితో ధర్మపురి హరి హర క్షేత్రమైనది. ఈ క్షేత్రంలో గోదావరి నది బ్రహ్మగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండంగా ప్రవహిస్తున్నది.

ఆలయ నిర్మాణం

ధర్మపురి రాజు ధర్మవర్మ నరసింహునికి ఆలయం Laxmi Narasimha Swamy కట్టించాడు. దీనితో పట్టణానికి ధర్మపురి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.పూ. 850 సంవత్సరంలోనే ఉండిందని ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. 1422- 36 మధ్య బహుమని సుల్తానులు ఆలయాన్ని ధ్వంసం చేశారని, 17 వ శతాబ్దంలో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ధర్మపురి ఫోటులు వాడగలరు

Also read

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది