ఈ స్తోత్రం చదివితే చాలు కష్టాలన్ని మాయం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఈ స్తోత్రం చదివితే చాలు కష్టాలన్ని మాయం !

 Authored By prabhas | The Telugu News | Updated on :2 February 2021,6:00 am

కాలభైరవాష్టకం

మానవ జీవితంలో కష్టాలు, బాధలు అనేవి తప్పనిసరి కానీ అవి ఎక్కువగా ఉంటే తట్టుకోవడం చాలా కష్టం అయితే వీటిని తప్పించుకోవాలంటే సామాన్యులకు చాలా కష్టం. వీటి నుంచి తప్పించుకోవడానికి హిందూమతంలో అనేక పూజలు, హోమాలు, వ్రతాలు చెప్పబడ్డాయి. కానీ నేటి ఆధునిక కాలంలో వాటిని చేయడానికి సమయం, ధనం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇవన్ని కాకుండా సులభంగా, శ్రీఘ్రంగా బాధలు పోయే అనేక స్తోత్రాలను ఆదిశంకరులు మనకు ఇచ్చారు. వీటిలో ఒక శక్తివంతమైన కాలభైరవాష్టకం తెలుసుకుందాం… కాలభైరవాష్టకం సకల బాధలను నివారిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అత్యమున మోక్షం ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రం…

కాలభైరవాష్టకం hymn to solve all your problems

కాలభైరవాష్టకం hymn to solve all your problems

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||
శూలటంక పాశదండ పాణిమాది కారణం,
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||
రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,
నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,
జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||
||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
||కాల భైరవం భజే||
||కాల భైరవం భజే||
||ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్||
ఈ స్తోత్రం ఎవరైతే శుచి, శుభ్రతతో పారాయణం చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు అనుభవంతో చెప్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది