Garuda Purana : మనం ఏం కావాలి అన్నది మన పుట్టుకకు ముందే రాయబడుతుంది.. ఇదిగో ఆధారం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda Purana : మనం ఏం కావాలి అన్నది మన పుట్టుకకు ముందే రాయబడుతుంది.. ఇదిగో ఆధారం…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Garuda Purana : మనం ఏం కావాలి అన్నది మన పుట్టుకకు ముందే రాయబడుతుంది.. ఇదిగో ఆధారం...!

Garuda Purana : గరుడ పురాణంలో విధి గురించి ఏమీ రాయబడిందో తెలుసుకుందాం.. దీని తర్వాత ఆచార్య చానక్యుడు చానిక్య నీతిలో మరియు భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీని గురించి ఏమని చెప్పారో చూద్దాం. హిందూ మత గ్రంథాలలో మరణం తర్వాత శరీరం మాత్రమే నాశనం అవుతుంది. కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదని రాయబడింది. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షల జన్మలలో ఉత్తమ జన్మ మానవునిదే అని చెప్పబడింది. మనిషి తన కర్మల ఆధారంగా మరణానంతర జీవితాన్ని పొందుతాడు. అంటే మరణానంతరం మీ జీవితంలో మీరు చేసిన మంచి చెడుకు ద్వారా మీరు ఏ జన్మ ఎత్తుతారని ముందే నిర్ణయించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయితే ధర్మం, వేదాలు పురాణాలు వంటి మత గ్రంథాలను అవమానించి మరియు దేవుని నమ్మడం అలాంటి నాస్తికుడు తదుపరి జన్మలో కుక్కలా పుడతాడు అని తెలుపబడింది. అలాగే ఎవరైతే మిత్రులు అనే ముసుగులో ద్రోహాలు చేస్తూ ఉంటారో అతని తదుపరి జన్మ ఈ భూమిపై రాబందు రూపంలో పుడతాడని తెలుపబడింది.

ఒక వ్యక్తి ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా అతని తదుపరి జీవితం మరియు ఆ కొత్త జీవితంలో అతను ఎదురుకునే కష్టాలు ఆ వ్యక్తి పుట్టకముందే నిర్ణయించబడతాయి. ఆచార్య చానక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన పనుల ద్వారా అతని మరణాన్ని ప్రభావితం చేయవచ్చు.. చానక్య నీతిలోని శ్లోకంలో పుట్టుబోయే జన్మలో ఆ మానవుని యొక్క విధి తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయని తెలిపారు. ,”విద్యా, మృత్యుమేవచ పంచయతీ గర్భసస్తే” ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మోతీబించిన జీవికి ఈ ఐదు విషయాలు అంటే వయస్సు, కర్మ సంపద, జ్ఞానం మరియు మరణ సమయం అతను తన తల్లి కడుపులో ఉన్నప్పుడు అదే సమయంలో అతని వీధిలో రాయబడి ఉంటాయని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా వివరించారు. ఆచార్య చానక్యుడు ప్రకారం ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి సుఖదుఃఖాలను అనుభవించవలసి ఉంటుందని ఈ కర్మలు ఇప్పటిది మాత్రమే కాకుండా పూర్వజన్మకు సంబంధించిన పాప పుణ్యాల చర్యల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి.

Garuda Purana మనం ఏం కావాలి అన్నది మన పుట్టుకకు ముందే రాయబడుతుంది ఇదిగో ఆధారం

Garuda Purana : మనం ఏం కావాలి అన్నది మన పుట్టుకకు ముందే రాయబడుతుంది.. ఇదిగో ఆధారం…!

పైన చెప్పబడిన శ్లోకం ప్రకారం పుట్టబోయే బిడ్డ యొక్క వీధిలో అతడు సంపద పొందగలడా.. లేదా.. అలాగే విద్యాభ్యాసం ఎంతవరకు ఉంటుంది. ఇలా ఇవన్నీ తల్లి కడుపులోనే నిర్ణయించబడతాయి. ఆచార్య చానిక్యుడు ప్రకారం మానవుడి జీవితంలో దాదాపు 11 సార్లు మరణం సంభవించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి అకాల మరణం, మరియు మరొకటి కాలమరణం.. అకాల మృత్యువును కర్మల ద్వారా సుఖ సంతోషాలతో మార్చవచ్చు.. కానీ కాల మృత్యు మారదు. కర్మ మరియు విధి రెండు చాలా ముఖ్యమైనవి అంటారు. కానీ పురాణాల ప్రకారం వీధి కంటే కర్మ చాలా ముఖ్యమైనదని చెప్పబడింది. నిజానికి మనం చేసే పనులు యొక్క కర్మ ద్వారా మన విధిని కూడా మార్చవచ్చు. నా దృష్టిలో కర్మ మరియు విధి రెండు చాలా ముఖ్యమైనవి అని అంటారు. ఎందుకంటే ఇది మన నియంత్రణలో ఉండదు. కాకపోతే కర్మ మన నియంత్రణలో ఉంటుంది. అందుకే మనం చేసే మంచి పనులు యొక్క కర్మతో మన విధి మార్చగలిగే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చారు. కాబట్టి కర్మ మరియు విధి మన జీవితాలలో చాలా ముఖ్యమైనవి వాటిని సద్వినియోగం చేసుకోవడం మనపై ఆధారపడి ఉంటుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది