స్వయం పాకంలో ఈ 3 వస్తువులు ఇస్తే 1000 రెట్లు ఎక్కువ ఫలితం…!
స్వయంపాకంలో ఈ మూడు వస్తువులు ఇస్తే 1000 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది.. స్వయంపాకంలో ముఖ్యంగా ఇవ్వవలసిన మూడు వస్తువులు ఏంటి..? ఈ మూడు వస్తువులు మాత్రం అస్సలు ఇవ్వకండి.. పొరపాటున కూడా స్వయంపాకంలో ఇవ్వకూడని వస్తువులు ఏంటి… అనే విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వచ్చే కృష్ణ పక్షాన్ని పక్షాలు అంటారు. ఈ సంవత్సరం కృష్ణపక్షం సెప్టెంబర్ 31 తారీకు నుండి ప్రారంభమై అక్టోబర్ 14 వ తారీకు వరకు కొనసాగుతుంది. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించాలి.. అదే సమయంలో పితృపక్షం జాతకంలో పితృ దోషాన్ని తొలగించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి గాను వారి ఆశీర్వాదం పొందడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ పదహారు రోజుల పితృ వేడుకలో మన పెద్దలు పూర్వికుల ఆత్మకు శాంతి చేకూరాలని కొన్ని రకాల పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ పితృపక్షాలలో పూర్వీకుల ఆత్మల శాంతి కోసం కొన్ని రకాల వస్తువులు దానం చేస్తారు. అలాగే కొన్ని వస్తువుల్ని అస్సలు దానం చేయకూడదు.. మరి పితృదేవతల ఆత్మల సంతృప్తి కోసం శ్రద్ధ దర్పణం రోజున దానం చేయవలసినటువంటి వస్తువులు ఏంటి..? ప్రాధాన్యత ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వయంపాకం అంటే బ్రాహ్మలు వాళ్ళంతట వాళ్లే ఒక పూటకు సరఫరా వండుకుని తినే వంటకు సరిపడా సామాగ్రిని ఇవ్వడం.. వాళ్ళు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఆ బ్రాహ్మలకు సమకూర్చడం.. దాన్నే స్వయంపాకం అంటారు. అయితే ఇక్కడ బ్రాహ్మలకు మాత్రమే స్వయంపాకం ఇవ్వాలా.. అంటే బ్రాహ్మణులకే కాదు.. సాధువులకి పేదలకి వండుకోవడానికి ఏమీ లేని వాళ్లకు కూడా ఇవ్వచ్చు.. అయితే ఎటువంటి వస్తువుల్ని దానం ఇవ్వాలి.
ఏ వస్తువుల్ని దానం ఇవ్వకూడదు.. అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నల్ల నువ్వులు దైవ భక్తితోసమానం నల్ల నువ్వు దానం చేయడం వల్ల మన పూర్వీకులు దాతలు ఇద్దరు కూడా ఫలితాన్ని పొందుతారు. పూర్వీకుల పేరిట దానం చేసినప్పుడు నల్ల నువ్వులు చేతిలో పట్టుకోవాలి అంటారు. ఈ కాలంలో మీరు ఇతర వస్తువుని దానం చేయలేక పోయినప్పటికీ నల్ల నువ్వులు దానం చేయవచ్చు. నల్ల నువ్వుల దానం చేయడం వల్ల ఇబ్బందులు విపత్తుల నుండి రక్షించబడతారని ఒక నమ్మకం. అలాగే బట్టలు పితృ కార్యాలు నిర్వహించే సమయంలో బట్టలు కూడా దానం చేయడం ఉత్తమం. పిండం పెట్టే రోజున ఒక జత బట్టలు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే బ్రాహ్మణులకు ఒక కేజీ బియ్యం, బెల్లం, ఉప్పు వివిధ రకాల కాయగూరలు, కారం అలా మనం ఒక వంట చేసేటప్పుడు ఏవైతే చేసుకుంటామో అవన్నీ కూడా కలిపి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి.
ఇక బెల్లం, ఉప్పు దానం చేయడం వల్ల మన పూర్వీకుల ఆత్మలు కూడా శాంతిని కలిగిస్తాయి. వారి ఆశీర్వాదాలతో ఇంట్లో ఆనందం ప్రశాంత వాతావరణము అనేది ఏర్పడుతుంది. మరణ భయం కూడా తొలగిపోతుంది. కష్టాల నుండి విముక్తి పొందడం కోసం కూడా శ్రాద్ధ సమయంలో బెల్లాన్ని ఉప్పుని కూడా దానం చేయాలి అంటారు. ఇకపోతే స్వయంపాక దానాలతో పాటుగా చెప్పులు కూడా ఇవ్వచ్చు. ఇలా దానం ఇవ్వడం వల్ల అది వారికి సంపూర్ణంగా ఉపయోగపడితే ఆ ఫలితం అనేది మీకు మీ కుటుంబానికి మీ పితృదేవతలకి కచ్చితంగా దక్కుతుంది…