Dussehra 2022 : దసరా రోజున ఈ మూడింటిని దానం చేస్తే ధనవంతులు అవడం ఖాయం …!
Dussehra 2022 : దసరా తెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజున దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తారు. దసరా పండుగ హిందూమతంలోనే అతిపెద్ద పండుగ. 9 నవరాత్రుల తర్వాత పదవరోజు దసరాను జరుపుకుంటారు.ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడు సంహరించినందున ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే శ్రీరాముడు రావణాసురుని సంహరించిన రోజు కూడా ఇదే. కావున అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతికగా దసరా పండుగను జరుపుకుంటారు.
అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అని ఒక నమ్మకం. అలాగే ఈ రోజున ఆయుధాలకు మరియు వాహనాలకు పూజ చేసి పూజిస్తారు. అలాగే ఈ రోజున ఒక మూడు ప్రత్యేక వస్తువులను దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం పొంది ధనవంతులవుతారని ఒక నమ్మకం ఉంది. వాటిని రహస్యంగా దానం చేయడం , ద్వారా అపారమైన ఆనందం శ్రేయస్సును పొందుతారు. ఆ మూడు వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దసరా రోజున ఏదైనా ఆలయాలలో కొత్త చీపురులను దానం చేయడం చాలా మంచిది.అలాగే దసరా రోజు రావణ దహనం తర్వాత అన్నదానం మరియు చీరలను పంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకం. దసరా రోజున ఈ పనులు చేయడం చాలా శుభప్రదం. అలాగే దసరా రోజున , బంగారం,వెండి కార్లు మొదలైన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజున కొనుగోలుచేయడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే దసరా రోజున పాలపిట్టని చూడడం, తమలపాకులను తినడం చాలా శుభప్రదం.