Vastu Tips : మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉంటే మీకు నష్టం తప్పదు…!!
Vastu Tips : సహజంగా మనం ఇంట్లో ఎన్నో మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో మొక్కలు ఉండటంవల్ల దాని ప్రత్యేక ప్రభావం మన జీవితంలో కనపడుతూ ఉంటుంది. ఇంకొక వైపు వాటిని సరి అయిన దిశలో ఉంచడం వలన మన సమస్యలు అన్ని తొలిగిపోతాయి. కొన్ని మొక్కలు ఉంటాయి. వాటి నాటడం వలన మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని కారణంగా ఎప్పుడు విభేదాలు వస్తూ ఉంటాయి. ఇల్లు వాతావరణం ప్రతికూల శక్తితో నిండిపోతుంది. ఇంట్లో ఆనందం శాంతి కోల్పోతారు. కావున ఇంట్లో సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇంట్లో ఎలాంటి మొక్కలను నాటకూడదో ఇప్పుడు మనం చూద్దాం..
ఇంట్లో ఈ మొక్కలను నాటవద్దు… *బోన్సాయ్: ఇంటి అందం కోసం ఇంట్లో ఈ మొక్కను నాటుతూ ఉంటారు. ఇంట్లో ఎల్లప్పుడు డబ్బు కొరత వస్తుంది. దీని వలన మీ జీవితంలో ఎప్పుడు అడ్డంకులు వస్తాయి. *అకేసియా : అకేసియా మొక్క కూడా ముళ్ళతో ఉంటుంది. కావున పొరపాటున కూడా దీనిని నాటకండి. దీనివలన ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతుంది. ఇంటి సభ్యుల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. *రోజ్ మేరీ మొక్క: ఈ మొక్కను ఇంట్లో నాటడం ఆ శుభం.
ఇది ఇంట్లో ప్రతికూలను తెస్తుంది. అలాగే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. *చింత చెట్టు: మీకు ఎక్కడైనా చింతచెట్టు కనిపిస్తే దానిని తీసేయండి. ఎందుకంటే దాంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది. ఈ చెట్టు ఆశుభమైనదిగా పరిగణించబడుతుంది. *కాక్టస్: ఈ మొక్కను ఇంట్లో నాటితే ఇంటి సమస్యలు పెంచుతుంది. అటువంటి పరిస్థితులు ఈ మొక్క కూడా ముళ్ళతో ఉంటుంది. కాబట్టి మనం దీనిని నాటడం మానుకోవాలి. ఇంట్లో ముళ్ళ మొక్కలను పెంచడం వలన ఇంట్లో గొడవలు ఏర్పడుతూ ఉంటాయి.