Crow : కలలో కాకి ఇలా కనిపిస్తే మీరు ధనవంతులు కావడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crow : కలలో కాకి ఇలా కనిపిస్తే మీరు ధనవంతులు కావడం ఖాయం…!

 Authored By aruna | The Telugu News | Updated on :26 October 2023,3:00 pm

Crow : మన హిందూ ధర్మంలో ఉన్న స్వప్న శాస్త్రం ప్రకారం ఒకవేళ కాకి గనుక మీ కలలోకి కనిపించినట్టయితే ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం.. సాధారణంగా కాకిని మన కలలో చూడడం అంటే అంత మంచిది కాదు.. కానీ కొన్ని ప్రత్యేకమైన కలలు మీకు కనిపించినట్టయితే అవి చాలా మంచి కలలుగా పరిగణంలోకి తీసుకోవచ్చు. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకవేళ మీ కలలో మీరు ఎగురుతున్న కాకిని చూసినట్టు అయితే రాబోయే రోజుల్లో మీ లైఫ్ లో ఏదో ఒక పెద్ద మార్పు రాబోతుంది అని అర్థం. రాబోయే రోజులు మీకు చాలా సమస్యలు ఎదురవబోతున్నాయని కల మీకు సంకేతిస్తుంది. ఒకవేళ మీ కలలో చాలా కాకులు ఒకే చోట కూర్చున్నట్టుగానో లేదా ఎగురుతున్నట్టుగానో చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఏదో ఒక చెడు వార్త మీరు వినబోతున్నారు అని కల మీకు సంకేతిస్తుంది.

ఒకవేళ మీరు మీ కలలో మాట్లాడుతున్న కాకిని చూసినట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీకు దన నష్టం కలిగే అవకాశం ఉంది. లేదా మీరు ఏదైనా ఒక చెడు వార్తను వినబోతున్నారు అని ఈ కల మీకు సంకేతిస్తుంది. ఒకవేళ కూర్చున్న కాకిని మీరు కలలో చూసినట్టుగా వస్తే అయితే మీరు ఏవైతే పనులు చేస్తారో ఆ పనులు ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కల మీకు సంకేతిస్తుంది. మీరు ఏవైతే పనులు చేస్తారో ఆ పనుల నుండి మీకు టెన్షన్స్ రావచ్చు. అంతేకాకుండా ఏవైనా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు తగిన జాగ్రత్త వహించాలి. ఒకవేళ మీరు ఏదైనా చెడ్డకల చూసినట్టయితే ఆ కలని అయినంత ఎక్కువ మందితో చెప్పేసుకోవాలి. అలా చెప్పడం వల్ల నీ మీద ఆ చెడ్డ కల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇతరులకు చెప్పడం వల్ల వాళ్లకి ఏ విధమైన ప్రభావం మీ మీద పడదు.

ఒకవేళ మీరు మీ కలలో కాకి మాంసాన్ని తింటున్నట్టుగా చూసినట్లయితే ఇది చాలా మంచి కల. రాబోయే రోజుల్లో మీకు చిన్న మొత్తంలో గాని లేదా పెద్ద మొత్తంలో గాని ధన లాభం కలగబోతుందని ఈ కల మీకు సంకేతిస్తుంది. ఒకవేళ మీరు కాకిని చంపుతున్నట్టుగానే లేదా తరుముతున్నట్టుగానే కలలో కనిపించినట్టయితే రాబోయే రోజుల్లో మీరు మీ శత్రువుల మీద జయం సాధిస్తారు అని అర్థం. కొద్దిగా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ మీరు జయం కచ్చితంగా సాధిస్తారు అని ఈ కల మీకు చెబుతుంది. ఒకవేళ మీరు కలలో చనిపోయిన కాకిని చూసినట్టుగా అయితే మీరు మీ జీవితంలో ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తొలగిపోతాయని కల మీకు సంకేతిస్తుంది…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది