Naga Panchami : వేద పంచాంగం ప్రకారం నాగ పంచమి రోజు ఇలా చేస్తే అధిక ధనలాభం…!
Naga Panchami : హిందూ మతంలో సకల జీవులను దైవంగా చూస్తారు. అందువలన చెట్లు, పాములు, పక్షులు, జంతువులూ అన్నిటిని దైవంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి పండగల్లో నాగ పంచమి ఒక్కటి. శ్రావణ మాసం శుక్ల పక్షంలోని 5వ రోజు నాగ పంచమి పాములను దేవుడిగా భావించి పూజ చేస్తారు. ఈ రోజున నాగదేవతలను పూజించడం సాంప్రదాయం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నాగ పంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. ఈ […]
ప్రధానాంశాలు:
Naga Panchami : వేద పంచాంగం ప్రకారం నాగ పంచమి రోజు ఇలా చేస్తే అధిక ధనలాభం...!
Naga Panchami : హిందూ మతంలో సకల జీవులను దైవంగా చూస్తారు. అందువలన చెట్లు, పాములు, పక్షులు, జంతువులూ అన్నిటిని దైవంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి పండగల్లో నాగ పంచమి ఒక్కటి. శ్రావణ మాసం శుక్ల పక్షంలోని 5వ రోజు నాగ పంచమి పాములను దేవుడిగా భావించి పూజ చేస్తారు. ఈ రోజున నాగదేవతలను పూజించడం సాంప్రదాయం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నాగ పంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. ఈ సమయంలో పూజలు చేయడం చాలా శుభప్రదం.
Naga Panchami నాగ పంచమి తేదీ మరియు శుభ ముహూర్తం 2024
వేద పంచాంగం ప్రకారం పంచమి తిధి ఆగస్టు 8వ తేదీ ఉదయం 12:36 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 10వ తేదీ తెల్లవారుజామున 03:14 గంటలకు ముగుస్తుంది. అదేవిధంగా నాగ పంచమి పండుగ శుక్రవారం 9 ఆగస్టు 2024న జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 06:01 నుంచి 08:37 వరకు పూజక చేసుకోవడానికి అనుకూల సమయం ఉంటుంది.
Naga Panchami నాగ పంచమి పూజా విధానం…
నాగ పంచమి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేవాలి. స్నానం చేసిన తర్వాత కొత్త దుస్తులు ధరించాలి. శివలింగానికి నీటిని సమర్పించి శివుడిని పూజ చేసుకోవాలి. తర్వాత ఇంటి ప్రధాన ద్వారం తలుపుకు రెండు వైపులా సుద్దతో పేయింగ్ వేసి బొగ్గుతో నాగదేవతల చిహ్నాలను తయారు చేసి నాగదేవతను పూజించడం ప్రారంభించాలి. నాగదేవతకు దీపం, పూలు, ధూపం, పచ్చి పాలు , పండ్లు ను నైవేద్యంగా నాగదేవతకు సమర్పించి హారతిని ఇవ్వాలి.
నాగ పంచమి శుభ యోగాలు..
నాగ పంచమి నాడు అనేక యోగాలు ఏర్పడనున్నాయి. వీటిలో శివ్వాస్ యోగా, సిద్ధ యోగా, సాధ్య యోగా, బల్వ కరణ యోగా ,అనేకా యోగాలు ఉంటాయి. అయితే నాగ పంచమిని హస్తా నక్షత్రం యొక్క పవిత్ర యాదృచ్చికంగా జరుపుకుంటారు. ఈ యాదృచ్చికాల్లో పూజించడం వలన భక్తులు కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఇలా చేయడం ద్వారా వీరి జీవితం ఆనందం శ్రేయస్సుతో నిండి ఉంటుంది.
నాగ పంచమి ప్రాముఖ్యత…
శ్రావణమాస వర్షాకాలంలో పాములు పుట్ట నుండి నేల పైకి వస్తాయి. అయితే ఈ సమయంలో పాములు ఎవరికీ హాని కలిగించకుండా ఉండటానికి నాగ పంచమిగా పూజిస్తారు. ఇక గ్రంధాలు పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే పంచమి తిథికి అధిపతి నాగేంద్రుడు. కాబట్టి ఈ రోజున పాములను పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. అలాగే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ,లభిస్తుంది. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే జాతకంలో ఉన్న రాహు కేతువుల దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు. కాల సర్పదోషం ,ఉన్నవారు ఆ రోజున నాగ దేవతను పూజించడంతో దోషలు తొలగిపోతుంది.