Naga Panchami : నాగ పంచమి రోజున.. సర్ప దోషం నివారణ కోసం పూజ ఎలా చేయాలి… శుభ సమయం ఎప్పుడు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Panchami : నాగ పంచమి రోజున.. సర్ప దోషం నివారణ కోసం పూజ ఎలా చేయాలి… శుభ సమయం ఎప్పుడు…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Naga Panchami : నాగ పంచమి రోజున.. సర్ప దోషం నివారణ కోసం పూజ ఎలా చేయాలి... శుభ సమయం ఎప్పుడు...?

Naga Panchami  : శ్రావణమాసంలో నాగ పంచమి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఈ నాగ పంచమిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు పాములను, శివున్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదని పవిత్రమైన రోజుగా కూడా పరిగణించబడడం జరిగింది. ఈ సంవత్సరం నాగ పంచమి 29 జూలై 2025వ సంవత్సరంలో వచ్చింది. ఈ రోజున ఎవరికైతే కాలసర్ప దోషాలు, సర్పదోషం, సర్ప భయం వంటివి ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం కలగాలంటే నాగ పంచమి రోజున పుట్టలో పాలు పోసి,నాగదేవులను,నాగదేవతలను పూజిస్తే,ఇంకా శివయ్యను కూడా పూజిస్తే అంతా శుభం కలిగి సర్ప దోష నివారణ జరుగుతుంది అంటున్నారు పండితులు. అయితే, ఈ నాగ పంచమి రోజున పూజ ఎలా చేయాలి, పూజ సమయాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రావణమాసంలో ప్రతి ఒక్క పండగ కూడా పవిత్రమైనది. హిందూమతంలో నాగ పంచమి కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈరోజు ప్రత్యేక ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది. రోజు నాగదేవతలను భక్తితో పూజించిన జీవితంలో కష్టాలన్నీ పోయి ముఖ్యంగా కాలసర్ప దోషాలు, సర్పభయం, సహా నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

Naga Panchami నాగ పంచమి రోజున సర్ప దోషం నివారణ కోసం పూజ ఎలా చేయాలి శుభ సమయం ఎప్పుడు

Naga Panchami : నాగ పంచమి రోజున.. సర్ప దోషం నివారణ కోసం పూజ ఎలా చేయాలి… శుభ సమయం ఎప్పుడు…?

Naga Panchami 2025 నాగ పంచమి ఎప్పుడు

25 నాగపంచమి జులై 29 మంగళవారం నాడు జరుపుకోవాలని పంచమి తిధి జులై 28న రాత్రి 11 :24 గంటలకు ప్రారంభమై, జులై 30న తెల్లవారుజామున 12: 46 గంటలకు ముగుస్తుంది. పంచమితి జులై 29 సూర్యోదయం నుంచి కనుక ఈ రోజున అంటే మంగళవారం నాగదేవతకు పూజ చేయాల్సి ఉంటుంది. ఈరోజున ఉపవాసం కూడా చేస్తారు.

పూజా సమయాలు : నాగ పంచమి పూజకు ఉత్తమ సమయం ఉదయం 5:41 నుంచి 8: 23 వరకు అంటే పుట్టలో పాలు పోసేందుకు సుమారు రెండు గంటలు శుభ సమయం.ఈ సమయంలో నాగదేవతను పూజిస్తే ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పండితులు. ఈ సమయంలో పూజించడం వల్ల సర్ప దోషం, కాలసర్పదోషం సహ ఇతర గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతున్నారు.

నాగ పంచమి ఎందుకు ప్రత్యేకమైనది : నాగ పంచమి కేవలం ఒక సాంప్రదాయమై కాదు, ఉపవాసం అనే కాదు ఈరోజు శక్తి సమతుల్యం చేసుకోవడానికి ప్రతికూల ప్రభావాలు తొలగించుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందర్భంగా చెప్పవచ్చు. పాములను పూజించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు, భద్రత లభిస్తాయని పురాణ గ్రంథాలలో ప్రస్తావించబడింది.ముఖ్యంగా, జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారికి ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది.

పాములను ఎలా పూజించాలి : సర్ప దేవత విగ్రహానికి లేదా చిత్రానికి పాలతో స్నానం చేయించండి.
. పాలు,లడ్డు, అటుకులు దర్పణం చేసి నైవేద్యంగా పెట్టండి.
. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శిస్తారు మరి కొందరు తమకు సమీపంలో ఉన్న పాము పుట్టలో పాలు పోసి పాములను పూజిస్తారు.
. పసుపు,కుంకుమ, పూలు,అక్షంతలతో అలంకరించండి.
. పాములను శివుని ఆభరణాలుగా ప్రకృతి రక్షకులుగా భావిస్తారు. కనుక నాగపంచమి రోజున పాములను పూజిస్తే ఆధ్యాత్మికంగానే కాదు పర్యావరణ సమతుల్యత కూడా కాపాడిన వారు అవుతారు.
ఏ పాములను ప్రత్యేకంగా పూజించాలి : రోజున అనంత వాసుకి, శేష, పద్మ, కంబల, కర్కోటక, అశ్విత్తర, ధృతరాష్ట్ర, సంక పాల, కల్యా, తక్షక,పింగళి అనే 12 ప్రధాన సర్పాలను పూజిచే ప్రత్యేక ఆచారం ఉంది.

Naga Panchami పంచమి రోజున సర్పాలను పూజిస్తే కలిగే ఫలితాలు

నాగ పంచమి రోజున, నాగసర్పాలకు పూజలు చేస్తే ఆధ్యాత్మిక సాధనే కాదు, హిందువుల సర్పాలకు శక్తి రక్షణ ఆధ్యాత్మిక పురోగతికి చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున భక్తితో పద్ధతితో పూజలు చేస్తే భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక శాంతి కర్మ శుద్ధి పొందడానికి ప్రగాడ విశ్వాసం.
. అకాల మరణం భయం పోతుంది.
. ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది.
. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
.సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుంది.

Naga Panchami నాగ పంచమి పూజ మాత్రమే కాదు సాధన

పంచమి రోజున నాగదేవులకు పూజలు నాగదేవతలను శాంతింప చేయడమే కాదు ఒక ఆధ్యాత్మిక సాధన కూడా హిందువులు సర్భాలకు శక్తి రక్షణ ఆధ్యాత్మిక పురోగతికి చిహ్నంగా భావిస్తుంటారు.ఈ రోజున భక్తితో పద్ధతితో పూజలు చేస్తే వ్యక్తి భౌతిక సుఖాలతో పాటు, ఆధ్యాత్మిక శాంతి,కర్మ శుద్ధి పొందుతారని విశ్వాసం కూడా.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది