Utpanna Ekadashi : నేడే ఉత్పన్న ఏకాదశి… ఈ శుభ సమయంలో ఈ దానాలు చేస్తే..
ప్రధానాంశాలు:
Utpanna Ekadashi : నేడే ఉత్పన్న ఏకాదశి... ఈ శుభ సమయంలో ఈ దానాలు చేస్తే..
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తిధి రోజున ఉత్పన్న ఏకాదశిని జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుని మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు. అదేవిధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం వలన మోక్షం లభించి వైకుంఠ ధామంలో స్థానం పొందుతారని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయట. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు యొక్క ఆశీస్సులు ఇంటి కుటుంబ సభ్యులపై ఉంటాయి. అలాగే ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్పన్న ఏకాదశి తిధి ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన తెల్లవారుజామున 1:01 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు నవంబర్ 27వ తేదీన ఉదయం 3: 47 గంటలకు ముగుస్తుంది. హిందూ సాంప్రదాయంలో ఉదయతిధి ప్రకారం చూసుకున్నట్లయితే ఏకాదశి నవంబర్ 26వ తేదీన జరుపుకుంటారు. ఇక ఉపవాసం దీక్షను నవంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 1:12 నుండి 3:18 గంటల మధ్యలో విరమించవచ్చు.
Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి శుభయోగం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్పన్న ఏకాదశి కంటే ముందుగా ప్రీతి యోగం ఏర్పడుతుంది. అనంతరం ఆయుష్మాన్ యోగ మరియు శివవాస్ యోగ వంటివి ఏర్పడుతున్నాయి. ఈ యోగాలలో లక్ష్మీనారాయణ పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ సమయంలో భగవంతుడు భక్తుల కోరికలను తీరుస్తాడని అదేవిధంగా కుటుంబం లో సుఖ సంతోషాలు సిరిసంపద లభిస్తాయి అని నమ్మకం. ఇక ప్రీతి యోగం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 2:14 గంటలకు ముగిసిన వెంటనే ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి రోజున ద్విపుష్కర యోగం నవంబర్ 27వ తేదీ ఉదయం 4:35 గంటల నుండి 6:54 గంటల వరకు ఉండగా ఉత్పన్న ఏకాదశి రోజున హస్త నక్షత్రం నవంబర్ 27వ తేదీన ఉదయం నుండి సాయంత్రం 4:35 నిమిషాల వరకు ఉంటుంది. అనంతరం చిత్రా నక్షత్రం వస్తుంది.
Utpanna Ekadashi ఉత్పన ఏకాదశి పూజా విధానం..
– ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం శంఖం ఊదిన తరువాత స్నానం చేయాలి.
– శ్రీమహావిష్ణువుని ధ్యానించి స్మృతి చెయ్యండి.
– శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతం తో శుద్ధిచేసి శుభ్రమైన వస్త్రాలను ధరించండి.
– శ్రీమహావిష్ణువు కి పసుపు చందనం అక్షంతలతో అలంకరించాలి. అనంతరం పువ్వులను సమర్పించండి.
– విష్ణువు ముందు ధూపం దీపం వెలిగించి సమర్పించండి.
– హారతి ఇచ్చి శ్రీమహావిష్ణువు మంత్రాలను జపించండి.
– ఉత్పన్న ఏకాదశి ఉపవాస వివరణ సమయం..
నవంబర్ 26వ తేదీన ఉత్పన్న ఏకాదశి ఉపవాసం పాటించినట్లయితే మరుసటి రోజు నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1:12 నుండి 3:18 మధ్యలో ఉపవాసాన్ని విరమించవచ్చు. అదేవిధంగా ఉత్పన్న ఏకాదశి విరమణ సమయం రోజున ఉదయం 10:26 గంటలకు హరి వాసర ను ముగించాలి.
Utpanna Ekadashi ఉత్పన ఏకాదశి ప్రాముఖ్యత..
హిందూ సాంప్రదాయంలో ఉత్పన్న ఏకాదశి పండుగ రోజున దేవాలయాలలో మరియు గృహాలలో లక్ష్మీదేవికి నారాయణడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఇక ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా భక్తులు గోదానానికి సమానమైన ఫలితాలను పొందుతారు. అయితే ఈ ఆచారాల ప్రకారం పూజించినట్లయితే శ్రీమహావిష్ణు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దీంతో జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.