Bhakthi Samacharam : దేవుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే 1000 రెట్లు ఫలితం…
Bhakthi Samacharam : హిందూమతంలో చాలామంది తమ ఇళ్లలో ప్రతిరోజు దేవుని పూజిస్తుంటారు. పూజలు, ఉపవాసాలు, ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడిని పూజించడం వల్ల దేవునిపై మనకు నమ్మకం. గౌరవం విశ్వాసం అనేవి ఏర్పడతాయి. ఒక వ్యక్తి భగవంతుని ఆరాధిస్తే అతను ప్రాపంచిక గ్రామాలను మరచి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకుంటాడు అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మనసుకు శాంతి సంతృప్తిని ఇస్తుంది. కానీ సరైనటువంటి నియమాలు నిబంధనలతో చేసినప్పుడే చేసే పూజకి ఫలితం లభిస్తుంది. అయితే ఈ నిత్యం పూజలు నైవేద్యం ఎలా పెట్టాలి? ఏది పెడితే మంచిది అనే విషయాలు తెలుసుకుందాం.. అయితే మన అందరి ఇళ్ళలోనూ పూజావిధులు ఒకే రకంగా ఉండవు. సంప్రదాయాన్ని బట్టి సాంస్కృతిని బట్టి ప్రాంతాన్ని బట్టి దైవాన్ని బట్టి పూజా విధానాలు మారుస్తూ ఉంటాయి.
ఇవన్నీ కాకుండా చాలా చాలా సింపుల్గా నిత్యం పూజ చేసుకోవాలి. అని అనుకుంటే ఒకే ఒక వస్తువు మన దగ్గర ఉండాలి. అది మన మనసు. అవును ఆ మనసు నిర్మలమై అందులో ప్రతిఫలించే పరమాత్మ జ్యోతి ప్రవకాశాన్ని అవును ఆ మనసు నిర్మలమై అందులో ప్రతిఫలించే పరమాత్మ జ్యోతి ప్రకాశాన్ని చూడగలగడమే పూజ యొక్క పరమార్థం. రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా భగవంతుడికి సమర్పిస్తుంటారు. ప్రతి దేవతకు ఒక ప్రత్యేక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందని మీకు తెలుసా. వాటిని ప్రసాదంగా నైవేద్యం పెడుతుంటారు. అయితే ఏ దైవానికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలని అవగాహనతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పాయసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి ప్రార్ధమైన ప్రసాదంగా చెబుతారు. చాలా ఇష్టమైనవి కనుక ఆయనకు వాటిని సమర్పించుకోవచ్చు.
లక్ష్మీదేవికి కూడా ఈ ప్రసాదం వీధిపారమైంది గా భావిస్తారు. లక్ష్మి పూజలో కూడా వీటిని వినియోగించవచ్చు. పంచామృతాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి వీటితోపాటు మిఠాయిలు ఏమైనా శివుడికి ఇష్టమైనవే.. పార్వతికి పాయసం ఇష్టమైన పదార్థంగా చెబుతారు. దేవునికి సమర్పించే నైవేద్యం కచ్చితంగా సాత్విక ఆహారమై ఉండాలి. పూజకు ఉపక్రమించే ముందు వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ప్రదానం. దేవుడికి నైవేద్యం తయారు చేయడానికి ముందు కచ్చితంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి. పాడైపోయిన పదార్థాలు పొరపాటున కూడా భగవంతుడికి సమర్పించకూడదు. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూడకూడదు. దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని తప్పనిసరిగా ముందుగా తీసి ఉంచాలి. దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత అది మిగతా భక్తులకు సమర్పించాలి. మామూలు పాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఏది అందుబాటులో లేకపోతే అప్పటికప్పుడు స్నానం చేసి వండిన వంట ఏదైనా నైవేద్యంగా పెట్టొచ్చు..