Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

 Authored By ramu | The Telugu News | Updated on :23 November 2024,6:03 am

ప్రధానాంశాలు:

  •  Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం... ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే...!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని ఉత్పన ఏకాదశి అని అంటారు. అయితే ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాదు ఈరోజే ఏకాదశి తిధి ఉద్భవించిందని విశ్వాసం. ఇక ఈ ఏకాదశి తీధి రోజు శ్రీ మహా విష్ణువుని మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఉత్పన్న ఏకాదశి ఈ ఏడాది నవంబర్ 26 వ తేదీన పాటించనున్నారు.ఇక ఈ రోజున ఉపవాసాలు దానధర్మాలు చేయడం వలన విష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే శ్రీ మహా విష్ణువుని లక్ష్మీదేవిని పూజించడం వలన జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదని నమ్మకం.

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి పూజ సామాగ్రి

ఉత్పన్న ఏకాదశి రోజున పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటంటే.. విష్ణుమూర్తి చిత్రపటం లేదా విగ్రహం. కొబ్బరికాయ ,పూలు, స్వీట్లు, పండ్లు ,తమలపాకులు, తులసి దళాలు, లవంగాలు దీపం, గంధం, ధూపం, నెయ్యి మరియు పంచామృతం.

Utpanna Ekadashi ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi ఉత్పన్న ఏకాదశి పూజా విధి..

ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు ఆ రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలను ధరించి ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తానని దేవుడి ముందు ప్రతిజ్ఞ చెయ్యాలి. అనంతరం దేవుడు గదిని శుభ్రపరిచి ఒక పీటపై వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి యొక్క విగ్రహం లేదా ఫోటోని ప్రతిష్టించండి. ఆ తరువాత శ్రీ మహా విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించండి. అనంతరం స్వామివారికి పండ్లు పూలు నైవేద్యం అక్షింతలు తులసి దళాలు ధూపం దీపం చందనం వంటివి సమర్పించండి. ఇక స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి మరియు పంచదారతో చేసిన పంచామృతాన్ని సమర్పించండి. అయితే స్వామివారికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి పంచామృతం లో తులసి దళాలను కలపండి. తరువాత శీఘ్ర ఏకాదశి కథను వినండి. పూజ చివరన దేవుడికి హారతి ఇచ్చి నైవేద్యాలను సమర్పించండి. అనంతరం ఆ నైవెద్యాలను అందరికీ పంచి పెట్టండి.

Utpanna Ekadashi విష్ణు మూల మంత్రాన్ని జపించండి.

” ఓం నమో నారాయణాయ ” ॥

” భగవతే వాసుదేవాయ మంత్రం

ఓం నమో: భగవతే వాసుదేవాయ.

విష్ణు గాయత్రీ మంత్రం

” ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి.

తన్నో విష్ణుః ప్రచోదయాత్” .

శ్రీ విష్ణు మంత్రం

” మంగళం విష్ణువు, మంగళం గరుంధ్వాజ్.

మంగళం పుండ్రీ కక్ష, మంగళయ్ తనో హరి “.

ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత : ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం వలన శ్రీ మహా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఆ వ్యక్తి జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించడంతో పాటు మోక్షం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున దానాలు ధర్మాలు ఎంతో పవిత్రమైనవి. అంతేకాదు ఈ రోజున చేసినటువంటి పూజలు బహుళ ఫలితాలను ఇస్తాయని నమ్మకం.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది