Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఆలయాలను సందర్శిస్తే సర్వపాపాలు తొలగిపోవడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఆలయాలను సందర్శిస్తే సర్వపాపాలు తొలగిపోవడం ఖాయం...!
Sravana Masam : లయకారుడైన పరమశివుడికి ఇష్టమైన మాసాలలో శ్రావణమాసం ఒకటి. ఈ సమయంలో పరమేశ్వరుడిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకంతో భారతదేశంలోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి పురాణాలు కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో అత్యంత విశిష్టమైన దేవాలయాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీరు ఏ ఒక్క దేవాలయాలని సందర్శించిన మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ధార్మికవేతలు చెబుతున్నారు. శ్రావణమాసం ముగియడానికి ఇంకా 30 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఏదో ఒక ఆలయానికి వెళ్లడానికి ప్రయత్నించండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Sravana Masam సోమనాథ్ దేవాలయం
భారతదేశంలోని జ్యోతి లింగాలలో ఒకటైన సోమనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. జ్యోతి లింగాలలో మొదటి క్షేత్రం. దీనిని ప్రభాసతీర్థం అని కూడా పిలుస్తారు.
Sravana Masam మల్లికార్జున దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఈ దేవాలయం జ్యోతి లింగాలలో ఒకటి. ఇక్కడ ఆ పరమశివుడు భ్రమరాంబ సహితంగా భక్తులకు దర్శనం ఇస్తాడు.
Sravana Masam మహాకాళేశ్వర లింగం
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న మహా కాలేశ్వరం పురాణ ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళి రూపంలో కొలువై ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం జరిగే బస్మహారతిని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
Sravana Masam : ఓంకారేశ్వర దేవాలయం
మధ్యప్రదేశ్ లోని నర్మదా నది మధ్యలో ఉన్న మంద తండి దీపంలో ఓంకారేశ్వర దేవాలయం ఉంది. ఆకాశం నుంచి చూస్తే ఈ దీపం ఓంకార రూపంలో కనిపిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. అలాగే ఇక్కడ పరమేశ్వరుడు మూడు ముక్కాల రూపంలో కనిపిస్తాడు. ముఖ్యంగా శ్రావణమాసం రోజు జరిగే ప్రత్యేక పూజలకు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
Sravana Masam భీమ శంకర దేవాలయం
మహారాష్ట్ర పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమా నది ఒడ్డున ఈ క్షేత్రం ప్రకృతి సంపదతో నిండి ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు భీమ శంకరుడి పేరుతో షాకిని దాకిని మొదలైన రాక్షసుల గణాలతో సేవించబడతాడని ప్రతిది.

Sravana Masam : శ్రావణమాసంలో ఈ ఆలయాలను సందర్శిస్తే సర్వపాపాలు తొలగిపోవడం ఖాయం…!
Sravana Masam కాశి విశ్వనాధ్ ఉత్తరప్రదేశ్
భారతదేశపు అతి ప్రాచీ నగరాలలో కాశి ఒక్కటి. దీనిని వారణాసి అని కూడా పిలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడిని పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే అప్పటివరకు చేసిన పాపాలన్నీ పోతాయని హిందూ భక్తులు నమ్ముతారు.