Zodiac Signs : రాబోయే 2025లో ఈ రాశుల ఎదుగుదల చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు… అదృష్టం అంటే ఈ రాశుల వారిదే..!
ప్రధానాంశాలు:
Zodiac Signs : రాబోయే 2025లో ఈ రాశుల ఎదుగుదల చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు... అదృష్టం అంటే ఈ రాశుల వారిదే..!
9 గ్రహాల యొక్క కదలికలు, మనిషి యొక్క జీవితాన్ని తెలియజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర పితామహులు తెలియజేశారు. శాస్త్రాలు కూడా ఇదే చెబుతుంది. నిర్దిష్ట సమయంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులు శుభ ఫలితాలను కలగజేస్తాయి. మరి కొన్ని రాశులు వారి కర్మ ఫలాలను బట్టి చెడు ఫలితాన్ని కలగజేస్తాయి. దేవతలకు గురువైన బృహస్పతి అత్యంత పవిత్రమైన గ్రహం. ఈ గ్రహము సంవత్సరానికి ఒకసారి తన స్థాన చలనాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రభావము అన్ని రాశులపై పడుతుంది. దీని దయ ఉంటే సంపద, సంతానం కలుగుతుంది. జీవితం దైవ శక్తి వైపు నడుస్తుంది. అక్టోబర్ 9వ తేదీ నుంచి వృషభ రాశిలోకి తిరోగమన దిశలో పయనిస్తున్నారు. దీని ద్వారా లాభపడే రాశుల వివరాలు తెలుసుకుందాం.
Zodiac Signs కన్యారాశి
బృహస్పతి తిరోగమన దిశలో ప్రయాణించటం వల్ల అనేక అవకాశాలు వస్తాయి. అదృష్ట దేవత వీరి ఇంటి తలుపు తడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే వీరంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలతోటి ఇబ్బందులు పడేవారు, ఈ సంవత్సరంలో వారి ప్రేమ వ్యవహారాలకు పెద్దల నుంచి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించబడతాయి.
కుంభ రాశి
ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు భారీగా లాభాలనుపొందుతారు. కొత్త ఆర్డర్లు ఉంటాయి. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలని విస్తరింప చేస్తారు. నూతన గృహ యోగాన్ని పొందుతారు. కుటుంబం సంతోషంతో చాలా బాగా జీవిస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా గడుస్తుంది.
మేష రాశి
ఈ మేష రాశి వారికి లక్ష్మీ కటాక్షం ఈ ఏడాదంతా వీరిపై ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మేషరాశిలో గురువు రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఎప్పటినుంచో మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయి. గృహ యోగాన్ని, వాహన యోగాన్ని కొనుగోలు చేయుటకు మంచి సమయం అని చెప్పవచ్చు.