Lizard : బల్లి మీద పడితే మంచిదేనా… శాస్త్రం ఏం చెబుతుందంటే….!
Lizard : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజమే. అయితే కొంతమంది వాటిని చూసి భయపడతారు. మరి కొంతమంది అయితే వాటిని అసలు పట్టించుకోరు. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే వంటింటి చిట్కాలు ద్వారా వీటి బెడద తగ్గించవచ్చు. కానీ ఇంట్లో ఎక్కువ బల్లులు ఉన్నట్లయితే కొన్నిసార్లు అవి మన శరీరం మీద పడతాయి. ఇలా బల్లులు మీద పడడాన్ని కొంతమంది అపశకనంగా భావిస్తారు. దీంతో చాలా కంగారుపడి వెంటనే స్నానం చేస్తారు. లేదా బంగారాన్ని పట్టుకుంటారు. అసలు బల్లి మీద పడితే ఏం అవుతుంది. ఇలా శరీరం పై బల్లి పడడం దేనికి సంకేతం..? దీనిని అశుభంగా పరిగణిస్తారా..? ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటాయి. మరి దీనికి సంబంధించిన విషయాలు గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… అలాగే శరీరంపై ఏ ప్రదేశంలో బల్లి పడితే శుభంగా పరిగణిస్తారో కూడా తెలుసుకుందాం.
– భోజనం చేసే సమయంలో బల్లులు శబ్దం చేస్తే దాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు.
– అదేవిధంగా బల్లి నుదుటిపై పడితే శుభంగా చెబుతారు.
– ముక్కుపై బల్లి పడిన అది మంచి శకునమే.
– అలాగే ఎడమ బుగ్గపై బల్లి పడితే పాత మిత్రులు కలుస్తారని చెబుతారు.
– ఇక మెడ పై బల్లి పడితే సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవం లభిస్తాయి.
– అలాగే కుడి చేతి పై బల్లి పడితే ధన ప్రాప్తి కలుగుతుందట.
– అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కుడి పాదం పై బల్లి పడితే ఆకస్మిత ప్రయాణాలు కలుగుతాయట.
కొంతమంది ఇలా బల్లులు పడితే చాలా భయపడతారు. కాని అంతలా భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాక ఈ విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోడానికి బల్లి శాస్త్రం కూడా ఉంది. ఈ బల్లి శాస్త్రం చదవడం ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా బల్లి పడటం వలన కొందరికి దోషాలు కూడా ఏర్పడతాయి. అందుకే బల్లి పడిన వెంటనే కాళ్లు చేతులు ముఖాన్ని శుభ్రం చేసుకుని ఇంట్లో దేవుడికి నమస్కరించాలని మన పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వలన ఎలాంటి దోషాలు కలగకుండా ఉంటాయని నమ్మకం.