Money Tips : పూజగదిలో ఇది కనిపిస్తే ధనానికి చిహ్నం.. సంపద పెరుగుతుందట..
Money Tips : ఇళ్లల్లో బల్లులు కనిపించడం సర్వసాధారణం.. చాలా మంది వాటిని చూస్తే బయపడతారు. కానీ ఆలయంలో లేదా దేవుడి గదిలో బల్లి కనిపిస్తే అది ధనం, సంతోషానికి చిహ్నమట. అంతే కాకుంటో ఇది ఇంట్లోని కుటుంబసభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలను సైతం సూచిస్తుందట. ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఇది చెబుతుందట. భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలను సైతం ఇది సూచిస్తుందట. దీనికి ఎక్కువగా చూస్తే మంచి జరుగుతుంది. ఇంట్లో దీపావళి రోజున రాత్రి ఇంట్లో బల్లి కనిపిస్తే చాలా శుభసూచకం. బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది.. దీపావళి రోజున బల్లి కనిపిస్తే త్వరలోనే ఇంట్లోకి లక్ష్మి దేవి రానుందని సూచిస్తున్నట్టు అర్థం.
ఇక బల్లుకు ఇంట్లో కొట్టాడుకుంటే ఏమవుతుంది? చనిపోయిన బల్లి ఎదురైతే దేనికి సంకేతం వంటి విషయాలు తెలుసుకుందామా?కొత్త ఇంట్లో లేదా ఇంట్లోకి వెళ్లే టైంలో బల్లి కనిపిస్తే అది మన పూర్వికుల రాకను లేకపోతే తండ్రి రాకను సూచిస్తుందట. మన పూర్వికుల బల్లుల రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతుంటారు. ఇంట్లోకి ప్రవేశించే టైంలో చనిపోయిన బల్లి లేదా పాతిపెట్టిన బల్లి కనిపిస్తే అది అశుభమని నమ్ముతారు. ఇక పడుకున్న టైంలో కలలో బల్లులు పోట్టాడుకుంటే మంచిది కాదట. కలలో మీరు బల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది పారిపోతే మంచి జరుగుతుందని సంకేతం.
Money Tips : కొత్త ఇంట్లో కనిపిస్తే..
రెండు బల్లులు పోట్టాడుకోవడాన్ని చూడకూడదట. అలా చేస్తే అది అశుభానికి సంకేతమం. ఇలా బల్లులు కొట్టాడుకోవడం వల్ల ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య బంధం దెబ్బతింటుదని అర్థం. ఇక గోడలపై ఉన్న బల్లి నేలపై పాకడం, లేదా కదలితే అది భూకంపం, తుఫానుకు సంకేతం. మరి ఇంట్లో ఉన్న బల్లులను చాలా మంది బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు ఇలాంటి విషయాలను పూర్తిగా గుర్తుంచుకోవాలి మరి.