Karthika Masam : 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహా పాపం.. అందరూ తెలుసుకోండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Masam : 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహా పాపం.. అందరూ తెలుసుకోండి…

Karthika Masam : ఈ కార్తీక మాసంలోచాలామంది 365 వత్తులు వెలిగిస్తూ ఉంటారు. మరి ఇలా 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక కొన్ని పొరపాటు చేసేస్తూ ఉంటారు. వెలిగించేటప్పుడు మనం పాటించవలసినటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కార్తీక పౌర్ణమి రోజు సోమవారం ఏకాదశి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ 365 వత్తులతో దీపారాధన చేయడం అనేది పరిపాని కానీ ఈ 365 వత్తుల వత్తులు వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగకుండా మనం ఇలా వెలిగిస్తే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 November 2022,10:00 pm

Karthika Masam : ఈ కార్తీక మాసంలోచాలామంది 365 వత్తులు వెలిగిస్తూ ఉంటారు. మరి ఇలా 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక కొన్ని పొరపాటు చేసేస్తూ ఉంటారు. వెలిగించేటప్పుడు మనం పాటించవలసినటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కార్తీక పౌర్ణమి రోజు సోమవారం ఏకాదశి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ 365 వత్తులతో దీపారాధన చేయడం అనేది పరిపాని కానీ ఈ 365 వత్తుల వత్తులు వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగకుండా మనం ఇలా వెలిగిస్తే ఆ దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మనం కచ్చితంగా పొందవచ్చు అలా కాక ఒకవేళ పొరపాటు చేస్తే వెలిగించిన ఫలితం ఉండదు. కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించేటప్పుడు అంటే 365 వత్తుల దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలా వెలిగించాలో అలాగే వెలిగించాక ఏం చేయాలో చూసేద్దాం.

365 వత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూది అందుకుంటూ మీ ఇంట్లో ఉండే పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది. మీరు మీ ఇంట్లో తయారు చేసిన వత్తులను మూడు కట్టలుగా కట్టాలి 120 + 120 + 125 గా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కూడా ఒక కట్టగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 365 వత్తులు రెడీగా ఉంటాయి. వెలిగించే ఒక గంట ముందు ఆవు నేతిలో నానబెట్టుకోవాలి. ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించటం కోసం మీరు పూజ చేసే సమయంలో మీరు మీ ఇంట్లోనైనా లేక దేవాలయంలోనైనా ఆ చోట అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గుపై పసుపు, కుంకుమ, అక్షతలతో అలంకరించుకుని దానిపై పసుపు వినాయకుని తమలపాకు పై పెట్టుకోవాలి. ముందుగా మనం చేయాల్సిందేంటంటే ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతి తో కానీ లేదా అగర్బత్తితో గాని వెలిగించుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవేతం గంధం, పసుపు, కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించాలి.

It is a great sin to make these mistakes without knowing when lighting 365 othis

It is a great sin to make these mistakes without knowing when lighting 365 othis

దుపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి. తరువాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని జపించి అక్షంతలు పూలు వినాయకుని పైవేసి ఆత్మ ప్రదక్షణ చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుని దగ్గర ఉన్నటువంటి అక్షంతలను మన తలపై వేసుకోవాలి. అంతేకాకుండా కుంకుమ బొట్టు కూడా అలాగే పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసిన తరువాత 365 బత్తులను వెలిగించుకోవాలి. ఈ 365 వత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ఆ ప్రమిదను ఒక ఆకుపైన ఒక ప్ర మీద పెట్టి ఆ ప్రమిదలు ఈ 365 వత్తులు పెట్టిన ప్రమిదను పెట్టుకోవాలి. ఇలా దీపం వెలిగించే సందర్భంలో హర హర మహాదేవ శంభో శంకర అని లేదా ఓం నమశ్శివాయ అని స్వామి నామాన్ని జపించుకోవాలి. ఇలా వెలుగుతున్నటువంటి ఈ 365 వత్తుల దీపాన్ని పసుపు, కుంకుమ అక్షంతలతో అలాగే పువ్వులతో చక్కగా పూజించాలి. ఇక ఈ 365 వత్తుల దీపానికి ధూపాన్ని చూపించాలి.

ఈ వెలుగుతున్నటువంటి ఈ దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి. లేదా చలిమిడి, వడపప్పు, పానకం సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూర హారతిని వెలిగించి వత్తులకు చూపించుకోవాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణాన్ని పట్టిస్తూ ఉంటే ఓం నమశ్శివాయ అనే జపాన్ని ఆ పరమేశ్వర ధ్యానానికి వాడుతూ చక్కగా మనం ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే సరిపోతుంది. పూర్తిగా వెలిగే వరకు ఉండని చాలామంది ఇంట్లోనే తులసి కోట ముందు వెలిగిస్తారు. 365 వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు. లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి. అలా చేసిన తర్వాత మనం దీపం వెలిగించిన ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 365 వత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఫలితం దక్కుతుంది. ఏ పొరపాటు లేకుండా మీరు చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకునే ప్రక్రియను పూర్తి చేస్తే 365 వత్తులు వెలిగించిన ప్రతిఫలం మీకు దక్కుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది