Kailasa Mountain : కైలాష్ పర్వతం లోపల బయటపడ్డ సజీవ నగరం.. పిరమిడ్ మరియు శివుని రహస్యం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kailasa Mountain : కైలాష్ పర్వతం లోపల బయటపడ్డ సజీవ నగరం.. పిరమిడ్ మరియు శివుని రహస్యం..

 Authored By aruna | The Telugu News | Updated on :30 July 2023,4:00 pm

Kailasa Mountain : మీ అందరికీ కైలాష్ పర్వతం గురించి తెలుసు కదా.. స్వయంగా మహా శివుడు అక్కడ కొలువై ఉంటాడని చెప్తూ ఉంటారు. అక్కడే మానస సరోవరం కూడా ఉంటుంది. ఇక్కడ లోపల అంతా ఖాళీగా ఉంటుంది అని చెప్తారు. అంతేకాదు కైలాసంలో ఈరోజుకి కూడా ఋషులు దేవతలు ధ్యానం చేస్తూ ఉంటారని ఇక్కడి ప్రజలు చెప్తారు. ఇప్పటిదాకా ఎవ్వరూ కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఎవరెస్టు సునాయాసంగా అధిరోహించిన వారు కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు మీకు తెలుసా.. కైలాస పర్వతం ఎవరెస్ట్ కన్నా 20000 మీటర్ల చిన్నదని ఎంతోమంది పర్వతారోహుతులు ఈ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరికీ సాధ్యపడలేదు. కానీ ఎవరెస్టు శిఖరాన్ని మాత్రం దాదాపు 7,000 మంది అధిరోహించారు. కైలాస పర్వతల నుండి నాలుగు పవిత్ర నదులు ఉద్భవించాయని అవి సప్లై, సింధు, బ్రహ్మపుత్ర మరియు గంగా నది ఈ నాలుగు నదులు ఈ ప్రదేశం మొత్తాన్ని నాలుగు దిశలుగా విభజిస్తాయి.

నాలుగు ముఖాలుగా కనిపిస్తుంది. ఇది నాలుగు దిక్కులను సూచించే కంపాస్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇంకో రహస్యం గురించి తెలుసుకుందాం.. చాలా దూరం ఉంటుంది. కైలాస పర్వతం మీద సూర్యుని కాంతి పడితే మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇది కొన్ని సార్లు పాలరాతి వెలుగులో మరికొన్నిసార్లు నీలిరంగుల కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం అంటే శివుడికి మహా ఇష్టమని చెప్తారు. అందుకే ఈరోజుకి కూడా శివుడు ఈ ప్రదేశంలో ధ్యానంలో ఉన్నాడని చెప్తారు. ఇక్కడ మనకు ఓంకార నాదం వినిపిస్తూ ఉంటుంది. అసలు ఓంకార నాదం ఇక్కడి నుంచే ఉద్భవించింది అని చెప్పారు. మీకు తెలుసా శివనామస్మరణతో ఇక్కడ మానస సరోవరంలో స్నానం చేస్తే స్వర్గం చేరుకుంటారని ఇక్కడ వారి నమ్మకం మీరు ఎవరైనా ఎప్పుడైనా కైలాస పర్వతం దగ్గరకు వెళ్తే మాత్రం మానస సరోవరంలో స్నానం చేయండి. ఇక్కడ స్నానం చేయడానికి సరైన సమయం తెల్లవారుజామున 3 నుండి 5 వరకు దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారని కూడా మీకు తెలుసు కదా.. ఈ సమయంలో దేవతలు కూడా ఇక్కడ స్నానమాచరిస్తారని చెప్పారు.

Kailasa mountain Pyramid and Shivas secret

Kailasa mountain Pyramid and Shivas secret

కైలాస శిఖరం శివలింగల్లా కనిపిస్తుంది. ఇక్కడ సంవత్సరం మొత్తం మంచు గడ్డకట్టి ఉంటుంది. ఈరోజుకి కూడా ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయింది. రామాయణం ప్రకారం రావణుడు భూమి నుంచి స్వర్గానికి ఇచ్చిన మార్గాన్ని నిర్మించాలని చూసాడు. ఆ మార్గం కైలాస పర్వతం మీద నుంచి నిర్మించాలని అనుకున్నాడు. వాటి జాడలు ఇప్పటికీ కైలాస పర్వతం మీద మనకు కనిపిస్తాయి. కానీ రావణుడు విజయం సాధించలేకపోయాడు. ఇవి కైలాస పర్వతం గురించిన కొన్ని రహస్యాలు ఇవే కాదు.. ఇంకా చాలా రహస్యాలు ఈరోజుకి ఇందులో దాగున్నాయి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది