Karthika Masam : ఈ కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర ఈ 12 దీపాలు పెడితే.. అప్పుల బాధ తీరిపోతుంది…!
Karthika Masam : కార్తీక శుద్ధ సప్తమి ఏడవనాడు ఒక విశేషమైన ఆ రోజు నాడు ఆర్థిక బాధలు ఎక్కువ ఉన్నవాళ్లు ఈ విధానాన్ని పాటించి చూడండి. ఆనాటి వ్రత మహిమ వల్ల మీకు దారులు ఏర్పడడం గాని మీరు చక్కగా సంపాదించుకోవడం గాని లేకపోతే మీ భాదను తీరడానికి ఏదైనా శాంక్షన్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరిగి మీకు లాభం జరుగుతుంది. ఈ కార్తీక శుద్ధ సప్తమి కార్తవీర్యార్జును జయంతి కార్తవీర్యార్జునుడు అంటే సహస్ర […]
ప్రధానాంశాలు:
Karthika Masam : ఈ కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర ఈ 12 దీపాలు పెడితే..
అప్పుల బాధ తీరిపోతుంది...!
Karthika Masam : కార్తీక శుద్ధ సప్తమి ఏడవనాడు ఒక విశేషమైన ఆ రోజు నాడు ఆర్థిక బాధలు ఎక్కువ ఉన్నవాళ్లు ఈ విధానాన్ని పాటించి చూడండి. ఆనాటి వ్రత మహిమ వల్ల మీకు దారులు ఏర్పడడం గాని మీరు చక్కగా సంపాదించుకోవడం గాని లేకపోతే మీ భాదను తీరడానికి ఏదైనా శాంక్షన్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరిగి మీకు లాభం జరుగుతుంది. ఈ కార్తీక శుద్ధ సప్తమి కార్తవీర్యార్జును జయంతి కార్తవీర్యార్జునుడు అంటే సహస్ర బాహువులతో మీ చేతులతో ఉండేటటువంటి కృష్ణమూర్తి స్వరూపం. ఆయన మనకి నష్ట ద్రవ్యానికి ఆయనే దేవుడండి. లాభం కావాలి అని అనుకున్నప్పుడు కార్తవీర్యార్జును జయంతి చూపించేటటువంటి నిశ్చల భక్తిశ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఏం కావాలి మనకి అంటే భక్తి ప్రధానమైన మేటర్. ఇందులో భక్తితో మనం చేస్తామో కార్తవీర్యార్జునో పూజ అంత చక్కటి ఫలితాలు అంత వేగంగా వస్తాయి. కాబట్టి మీరు చేయవలసినదల్లా ఆనాడు కార్తీక శుద్ధ సప్తమి రోజు నాడు పొద్దుట నుంచి స్నానపారాధన చేసుకొని మీరు శక్తి ఉంటే ఉపవాసం చేయొచ్చు. శక్తి లేకపోతే ఉపవాసం చేయవలసిన అవసరం లేదండి.
ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. మీరు ఉదయం పళ్ళు పాలు ఇటువంటివి తీసుకోవచ్చు. అంటే ఉడికిన పదార్థాలు ప్రచారం చేసిన ఆహారం కాకుండా ప్రకృతి ప్రసాదించాలని అటువంటి పళ్ళు పాలు లాంటివి తీసుకుని మీరు హాయిగా కావలసిన మోతాదులతోనే ఉండవచ్చు. ఎక్కువ తినొచ్చు. చక్కగా మీకు సరిపడా తినొచ్చు. సాయంకాలం ఐదు గంటలకి చక్కగా స్నానం చేసుకొని తలస్నానం కంపల్సరీ చేయాలి. తలస్నానం చేసుకొని తులసి కోట దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని చేస్తామండి. గుడిలో కాదు. ఇంట్లో దేవుడి దగ్గర కూడా కాదు. తులసి కోట దగ్గర శుభ్రం చేసుకుని లక్ష్మీపాదాలు వంటి ముగ్గులు అన్నీ కూడా మన సోదరీమణులందరికీ వేసుకునేది అని చక్కగా వేసుకుని సిద్ధం చేసుకుని చక్కటి పూలతో తులసి కోటని అలంకరించి అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే మట్టి ప్రమిదలలో ఎప్పుడు మనం పెడుతూ ఉంటాం కదా.. అట్లాగే మట్టి ప్రమిదలలో మీరు పెట్టుకోవలసినది మూడేసి వత్తులు చొప్పున మొత్తం 12 దీపాలు వెలిగించాలి.. విడివిడిగా వెలగాలి అంటే ఒక ప్రమిదలో మూడు దీపాలు వెలగాలన్నమాట. అంటే దానికి తగ్గట్టుగా ప్రమిదలు తెచ్చుకుని మీరు 12 దీపాలు తులసి కోటకు పెట్టుకోవాలి. మీరు పూజ చేసుకోవచ్చు.
ఈ 12 దీపాలు వెలిగించుకోవాలి. అసలు కార్తవీర్యార్జునా తంత్రం ఉండే సాయంకాలం ఈ కార్యక్రమం చేసి అప్పుడు మనకి ఉన్నటువంటి ఆర్థిక బాధని మనం ఆ కార్తవీర్యార్జున స్వామి తో చెప్పుకోవాలండి. ఎలా చెప్పుకోవాలి అంటే స్వామి నేను నీ పూజ నీ విధంగా చేస్తున్నాను. నాకు ఇంతే శక్తి ఉన్నది. కానీ భక్తిలో లోపం లేదు. సహస్ర బాహువైన నువ్వే నాకు దిక్కు ఇంకెవరూ లేరు అని మీరు మనస్పూర్తిగా నమస్కారం చేసుకొని మీరు ఆరోజు చేయవలసిందిగా చెరకు గడలు పెట్టాలి.ఆ పూజలోనే 12 టెంకాయలు కొట్టి స్వామివారికి నివేదన చేస్తారండి..తరువాత హారతి ఇవ్వాలి.ఇలా చేయడం వలన చాలా వేగంగా ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. చాలా సుఖంగా శుభంగా సంతోషంగా గడుపుతారు…